
హైదరాబాద్: హైడ్రా ఆర్డినెన్స్ చట్ట విరుద్ధమంటూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమంటూ తెలంగాణ హైకోర్టులో మాజీ కార్పోరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయగా, ఈ మేరకు హైకోర్టు విచారణ చేపట్టింది.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్ సహా ప్రతివాదులకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా?
Comments
Please login to add a commentAdd a comment