Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ap Police Rudely Against Yoga Teachers1
లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్‌ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్‌ ఆదేశాలతో పలువురిని అరెస్ట్‌ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు.

Lalit Modi Vijay Mallya singing together Video Viral2
ఇంటర్నెట్‌ను ఈ వీడియో కుదిపేయకపోతే మంచిదే!

విజయ్‌ మాల్యా-లలిత్‌ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్‌ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. I Did It My Way అంటూ అలనాటి అమెరికన్‌ సింగర్‌ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్‌లో గత ఆదివారం తన నివాసంలో లలిత్‌ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లలిత్‌ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్‌ మోదీ చివర్లో సందేశం ఉంచారు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi)గేల్‌ గతంలో ఐపీఎల్‌ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్‌ సైతం తన మాజీ బాస్‌లు లలిత్‌ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

Yuvraj Singh headlines Indias squad for WCL Season 23
భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్‌గా యువ‌రాజ్ సింగ్‌

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్‌మెంట్‌ తమ జట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా లెజెండ‌రీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ మ‌రోసారి ఎంపిక‌య్యాడు. 2024లో అరంగేట్ర ఎడిష‌న్‌లో యువీ సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గ‌జాలు ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జ‌ట్టు స‌మ‌తుల్యంగా క‌న్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు ద‌క్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, ప‌వ‌న్ నేగి నిర్వ‌హించ‌నున్నారు. ఇక బ్యాటింగ్ లైన‌ప్‌లో యువీ, ధావ‌న్‌, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నారు.తొలి పోరు పాక్‌తోనే..ఇక డ‌బ్ల్యూసీఎల్ సెకెండ్ సీజ‌న్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్‌లోని నాలుగు వేదిక‌ల‌లో జ‌ర‌గ‌నుంది. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్య‌మివ్వ‌నున్నాయి.ఈ టోర్నీలో భార‌త్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జ‌ట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి నాలుగు స్దానాల్లో నిలిచే జ‌ట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియ‌న్స్‌ త‌మ తొలి మ్యాచ్‌లో జూలై 20న పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్

Thammudu Movie Twitter Review4
‘తమ్ముడు’ మూవీ ట్విటర్‌ రివ్యూ

శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.#Thammudu Review : A Good emotional Ride with Solid Production values - 3/5 💥💥💥Mainly Youth Star ⭐️ @actor_nithiin has given one of the career best performance 🔥🔥🔥💥💥 with a good comeback film 🎥👍❤️‍🔥 #Nithiin Director #SriramVenu Handled the subject very well with… pic.twitter.com/Xy0CFOvlKH— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025 తమ్ముడు సినిమాలో విలువలతో పాటు మంచి ఎమోషన్‌ పండించే సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నితిన్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫెర్పార్మెన్స్‌ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బీజీఎమ్ బాగుంది. క లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు. Second half has excellent fight sequences…fans ki full meals aa fight sequences…Overall good movie. One time watch.Must in Theaters.#Thammudu @actor_nithiin https://t.co/ZHf0uZ0tr2— Mythoughts 🚩 (@MovieMyPassion) July 4, 2025 ఫస్టాఫ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌లో ఫైట్‌ సీక్వెన్స్‌ అదిరిపోతాయి. ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌లా ఫైట్‌ సీక్వెన్స్‌ తీర్చిదిద్దారు. ఓవరాల్‌గా తమ్ముడు గుడ్‌ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాలి’ అని ఒక నెటిజన్‌ రాసుకొచ్చాడు. Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025బిలో యావరేజ్‌ సినిమా ఇది. రెండు ఫైట్‌ సీక్వెన్స్‌ మినహా సెకండాఫ్‌ అంతా బోరింగ్‌గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాలేదు. యాక్షన్‌ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్‌ అయింది. వేణు శ్రీరామ్‌ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్‌గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్‌ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు.#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish! Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…— Venky Reviews (@venkyreviews) July 4, 2025 విలన్ క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉన్నా.ఆ పాత్ర తాలుకు సంఘర్షణ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం బాగుంది. సెకండాఫ్‌లో ఒక సీన్‌ బాగుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదంటూ మరో నెటిజన్‌ 1.75 రేటింగ్‌ ఇచ్చాడు.#Thammudu is a super knit commercial movie.First half starts a bit slow and the director takes his own time to establish the plot. There’s no looking back from the pre-interval to the superb INTERVAL BANG 💥.Post interval scenes are the major highlights of the movie.3.5/5— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) July 4, 2025#thammudu First Half Review: Starts off with a familiar setup and unfolds at a slow pace, especially during the forest portions. The drama and stakes feel underwhelming so far. Hoping the second half picks up and delivers better.#ThammuduTrailer #nithin #DilRaju— Dingu420 (@dingu420) July 4, 2025

Donald Trump Big Victory One Big Beautiful Bill Clears Congress5
ట్రంప్‌ భారీ విజయం.. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు సభ ఆమోదం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కల సాకారమైంది. ట్రంప్‌ కలల బిల్లు అయిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో, ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్‌ విజయం సాధించారు.అమెరికా ప్రతినిధుల సభ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్‌.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక, అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్‌ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్‌ తీసుకొచ్చారు. ✅ The House of Representatives just officially PASSED the One Big Beautiful Bill.The largest middle-class tax cut in American history — and so much more — is on its way to President Trump's desk.MAGA! pic.twitter.com/V3U8xhenrS— Rapid Response 47 (@RapidResponse47) July 3, 2025ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అమెరికా కాంగ్రెస్‌లో అధికారికంగా ఆమోదం పొందడంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పన్ను తగ్గింపులు, రక్షణ, సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు.The One Big Beautiful Bill:✅ Passed ✅ Signed ✅ Heading to President Trump’s desk to become lawMuch-needed and much-deserved relief for hardworking Americans is on the way! pic.twitter.com/zoh2dKlfO5— Speaker Mike Johnson (@SpeakerJohnson) July 3, 2025ట్రంప్‌ ఆనందం.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్‌ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్‌.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు. తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉంది. ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వైట్ హౌస్‌లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను, సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం. అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jul 03, 2025, 6:15 PM ET )The Republicans in the House of Representatives have just passed the “ONE BIG BEAUTIFUL BILL ACT.” Our Party is UNITED like never before and, our Country is “HOT.” We are going to have a… pic.twitter.com/qR2Dql3IYh— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) July 3, 2025బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు..2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్‌టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.వలస నియంత్రణపై ఫోకస్‌...ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.ఆరోగ్య పథకంలో భారీ కోతలుతక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు. రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు.

Flexi Protest Against Congress Government During Kharge Visit6
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

YSRCP leaders provided evidence to EC On EVM Machines Issues7
ఇవిగో సాక్ష్యాలు..!

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్‌ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్‌ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. పలు నియోజక­వర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్ప­దంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధా­రాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీ­రుపై సర్వత్రా అనుమా­నాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్‌ బూత్‌లలో చోటు­చేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్‌సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు వివేక్‌ జోషి, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్షనేత పి.మిథు­న్‌­రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ హాజర­య్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావే­శంలో ఎన్నికల్లో జరిగిన అవక­తవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్‌రెడ్డి, చంద్రశేఖ­ర్‌తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈవీఎం, వీవీ ప్యాట్‌లను పోల్చి చూడాలి2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్‌ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్‌ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్‌ సమయంలో 98 శాతం చార్జింగ్‌ ఉన్న సందర్భాలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్‌ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నా­యని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్‌లను కంపారిజన్‌ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్‌ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్‌ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.రాయచోటి ఓ ఉదాహరణ..2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎక్కువ శాతం పోలింగ్‌ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌కు అందించాం. దీనిపై ఈసీ సానుకూ­లంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్‌ హిందూపురం ఓటింగ్‌ సరళిలో వ్యత్యాసాలు..ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహా­లను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకత­వ­కలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌–157, 28లలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్‌లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్‌ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్‌ తరహాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ అంగీకరించారు.బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరపాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియ­చేశాం. అమెరికా, జర్మనీ, యూరప్‌ దేశాల్లో సైతం బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్‌ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువా­రం వైఎస్సార్‌సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది.

BJP May get first woman As Party president Post8
బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే, బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, కీలక పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్టు నేషనల్‌ మీడియా(ఇండియా టుడే)లో కథనాలు వెలువడ్డాయి.బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఎంపీ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. తుది ని‍ర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. నిర్మల ముందంజ..అయితే, రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్‌కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. వనతి శ్రీనివాసన్..తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ కూడా పరిశీలనలో ఉంది. ఆమె ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను ఆమె నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో వనతి మార్క్‌ కనిపించే అవకాశం ఉంది.పురందేశ్వరిరాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్‌ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగారు.ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదంమహిళా నాయకత్వం, ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Japanese Baba Vanga disaster prediction And Earthquakes9
జపాన్‌లో వరుస భూకంపాలు.. తత్సుకీ మెగా సునామీ సంకేతమా?

టోక్యో: వరుస భూకంపాలు జపాన్‌లోని మారుమూల ద్వీపాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. ఏ క్షణం ఏం జరగుతుందోని ఆందోళనతో రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్‌ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాలలో జపాన్‌ ఒకటి. టెక్టోనిక్‌ ప్లేట్లు కలిసే.. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రదేశంలో ఉండటంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలను ఎదుర్కొంటుంది. కాగా, 12 టోకారా దీవులలో ఏడింటిలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవులలో కొన్నింటిలో ఆసుపత్రులు లేవు. ప్రిఫెక్చురల్‌ రాజధాని కగోషోమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం ఆరు గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్‌హౌస్‌లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ, ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు వస్తున్నాయి. 🌏 Current Earthquake Swarm ongoing south of Southern mainland #Japan near Tatsugō.Several M 4.5+ events - could portend a stronger #earthquake to come, and the region should be monitored closely 👀⚠️ This is one of the riskiest world areas in JULY 2025 because of this. pic.twitter.com/K0dmPQZMrP— Weather & Earth 25 (@Weather_Earth25) July 2, 2025ఇదిలా ఉండగా.. శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్‌ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్‌ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్‌ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దీంతో, శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్‌ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్‌’ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రండింగ్‌లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘జపాన్, ఫిలిప్పీన్స్‌ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరమ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’ అంటూ వర్ణించారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్టు. ‘ద ఫ్యూచర్‌ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్‌ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్‌ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్‌ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు.

Road Accident In Mahabubabad: Two Lorries Collided Head On10
ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం

సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్‌ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్‌ వెళ్తుండగా, మరో లారీ వరంగల్‌ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్‌లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement