వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఎన్‌టీఏ... రిజిస్ట్రేషన్ నంబర్‌తో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు
22 నుంచి 30వ తేదీ వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22 నుంచి జరిగే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాల వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం వెల్లడించింది. విద్యార్థులకు ఏ షిఫ్ట్, ఏ కేంద్రంలో, ఎన్ని గంటలకు పరీక్ష ఉంటుందనే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. జేఈఈకి ఈ తరహా ముందస్తు సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి. నోటిఫికేషన్ సమయంలో జేఈఈ పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించింది. తాజాగా పరీక్ష కేంద్రం వివరాలు తెలియజేయడంతో విద్యార్థులు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకునే వీలు కలిగింది. పరీక్ష కేంద్రం సమాచారం తెలుసుకునేందుకు జేఈఈ మెయిన్–2025 వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించింది.
జేఈఈ మెయిన్ తొలి విడతకు సంబంధించి పేపర్–1 పరీక్షలు 22 నుంచి 29 వరకు జరుగుతాయి. బీటెక్‌లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30వ తేదీన పేపర్–2ఎ (బీఆర్క్), పేపర్–2బీ (బీ ప్లానింగ్, బీఆర్క్ మరియు బీ ప్లానింగ్) పరీక్షలు ఉంటాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ బీలో ఈసారి 5 ప్రశ్నలు ఇస్తారని ఎన్‌టీఏ తెలిపింది. గత మూడేళ్ల మాదిరి ఈసారి చాయిస్ ఉండదు. రెండు సెక్షన్లలో కూడా మైనస్ మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పుడు సమాధానానికి మైనస్ వన్ మార్కు ఉంటుంది. స్కో ర్ కోసం తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం విభాగంలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment