
సాక్షి, సూర్యాపేట: జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆటను తిలకించే క్రమంలో ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ స్టాండ్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇక ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. గ్యాలరీ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది అక్కడ కూర్చోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా 47వ జూనియర్ జాతీయ కబడ్డీ చాంపియన్ షిప్- 2021ను సోమవారం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment