హైదరాబాద్, సాక్షి: లగచర్ల అధికారుల దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారేక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది.
తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారేక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే.. తన రిమాండ్‌ను కొట్టి వేయాలని నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరికాసేపట్లో విచారణ జరపనుంది.
మరోవైపు నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణనువికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment