ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో కురుస్తాయన్న వాతావరణ శాఖ
రెండ్రోజులు సాధారణం కంటే తక్కువగా నమోదవనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని ప్రణాళికా శాఖ వివరించింది.
తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు: తేలికపాటి వర్షాల నేపథ్యంలో గురువారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా జకొరలో 43.6 డిగ్రీలు, సలూరలో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రానున్న వారం రోజులపాటు సాధారణం నుంచి కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది.
వడగాడ్పులకు బ్రేక్...: ప్రస్తుత వేసవి సీజన్‌లో వడగాడ్పులకు బ్రేక్ పడినట్లు వాతావరణ నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం కేవలంపశ్చిమ రాజస్తాన్‌లోనే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన బలమైన గా లులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉరుము లతో కూడిన గాలివానలు పెరుగుతాయని చెప్పారు. అయితే భారీ వర్షాలకు మాత్రం ఆస్కారం లేదని, దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment