వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: పశ్చి మ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ప్రస్తుతం వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment