
సాక్షి, హైదరాబాద్: మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021లో భాగంగా కొచ్చిలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో తెలంగాణకు చెందిన దీప్తి శ్రీరంగం మిస్ క్వీన్ తెలంగాణగా ఎంపికైంది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మణప్పురం, పెగాసస్ సంస్థల నిర్వాహకులు పోటీల వివరాలు వెల్లడించారు. 19వ ఎడిషన్‌గా నిర్వహించిన ఈ పోటీల్లో కేరళకు చెందిన అన్సీ కబీర్ మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకోగా, మిస్ చంద్రలేఖ నాథ్, శ్వేతా జయరామ్ తరువాతి స్థానాల్లో నిలిచారని వారు తెలిపారు.
చదవండి: నష్టాలను తప్పించుకునేందుకే కరోనా సాకు
కాగా కేరళకు చెందిన అన్సీ కబీర్ మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే మొదటి రన్నరప్‌గా చంద్రలేఖ నాథ్. సెకండ్ రన్నరప్‌గా శ్వేతా జయరం నిలిచారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment