సాక్షి, హైదరాబా: నగరం పై కురుస్తున్న తొలకరి చిరుజల్లులు ఓ వైపు... నగరం వేదికగా నిర్వహించిన మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే ర్యాంప్ పై నడుస్తున్న టాప్ మోడల్స్ సోయగాలు మరో వైపు. వెరసి ఆదివారం నగరం అందాల సోయగాలతో పులకించిపోయింది. శ్రీనగర్ కాలనీలోని విన్‌ఫ్లోరాలో జరిగిన మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్ మొదటి ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో 3 రాష్ట్రాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు క్యాట్‌వాక్‌తో అలరించి విజేతలుగా నిలిచారు.
ఇందులో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణగా నిహారిక సూద్, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందన జయరామ్, మిస్ యూనివర్స్ కర్ణాటకగా అవనీ కాకేకోచి టైటిల్ క్రౌన్ గెలుచుకున్నారు. ర్యాంప్ పై వాక్ చేసిన అందాల తారలను బ్యూటీ, ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజేతలుగా ఎంపిక చేశారు. ఈ ఫ్యాషన్ జ్యూరీలో మిస్ యూనివర్స్ స్టేట్ డైరెక్టర్ ప్రాచీ నాగ్‌పాల్, మిస్టర్ గ్లోబల్ 2023 జాసన్ డైలాన్, సెలబ్రిటీ డెంటిస్ట్ డాక్టర్ నిదా ఖతీబ్, ఫ్యాషన్ డిజైనర్ అంజలి ఝా, ఫౌండర్ చుర్రోల్టో నీహర్ బిసాబతేని పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ స్టేట్ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి 96 మంది పాల్గొనగా..వీరిలో ఒక్కో రాష్ట్రం నుంచి 7 మంది చొప్పున 21 మందిని ఫైనలిస్టులుగా ఎంపికచేశారు.
21 మందిలో ఒక్కో రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ స్టేట్ విన్నర్‌తో పాటు, ఇద్దరు రన్నరప్‌లను ఈ గ్రాండ్ ఫినాలే విజేతలుగా ప్రకటించింది. బెస్ట్ స్మైల్, బెస్ట్ అటైర్ టైటిల్స్ ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ ఫినాలేలో యువతులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఫ్యాషన్ మోడల్స్ సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment