
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన బాధితుడు.. 20 నుంచి జ్వరంతో బాధపడుతుండగా 23న దద్దుర్లు రావడంతో మంకీపాక్స్‌గా అనుమానిస్తున్నారు. బాధితుడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించారు. వారిని వైద్యులు ఐసోలేషన్‌లో ఉంచారు. పుణె ల్యాబ్‌కు మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తి శాంపిల్స్ పంపించారు.
చదవండి: భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. పెరుగుతున్న కేసులు
ప్రస్తుతం భారత్‌లో సైతం మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో మరో పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కాగా, ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment