
సాక్షి, హైదరాబాద్: పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ( ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాలపై తాజాగా ఎన్‌ఐఏ అధికార ప్రకటన వెల్లడించింది. తెలంగాణా, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించాము. హైదరాబాద్‌లో రెండు చోట్ల సహా థానే, పాలక్కడ్, చెన్నై, మల్లాపురం సోదాలు చేశాము. సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు సంజయ్ దీపక్‌ను సైబరాబాద్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశాము.
అరెస్ట్ సమయంలో రివాల్వర్ సహా నకిలీ ఆధార్ కార్డులు, 47వేల నగదు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఆధారంగా గత నెలలో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ రోజు ఉదయం నుంచి నాలుగు రాష్ట్రాల్లో ఆరు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేశాము. సోదాల్లో భాగంగా పలు డాక్యుమెంట్లు, ఆరు చరవాణులు, సిమ్ కార్డులు, 1.37లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
చదవండి: ‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment