
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(OD)లను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లల ఓడీలను ప్రభుత్వం రద్దు చేసింది.
కాగా, తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్ వీఐజీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment