on duties
-
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(OD)లను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లల ఓడీలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్ వీఐజీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఎస్ఎస్ఏ సిబ్బంది బాధ్యతల స్వీకరణ
అనంతపురం ఎడ్యుకేషన్: సర్వశిక్ష అభియాన్‌లో సెక్టోరియల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్లుగా నియామకమైన వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రొద్దం మండలం నారనాగేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆనంద్‌బాబును కమ్యూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్ (సీఎంఓ)గా నియమించారు. అలాగే రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న నారాయణస్వామిని ఏపీఓగా, విడపనకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఆనందభాస్కర్రెడ్డిని అసిస్టెంట్ అలెస్కోగా నియమించారు. వీరు ముగ్గురూ విధుల్లో చేరారు. ఐఈడీ కోఆర్డినేటర్‌గా నియామకమైన రామగిరి ఎంఈఓ రవినాయక్, అసిస్టెంట్ జీసీడీఓ కమలాక్షి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా జీసీడీఓగా నియామకమైన లక్ష్మీశిరీష విధుల్లో చేరేందుకు అయిష్టత కనబరిచారు. ఈ మేరకు అధికారులకు రాతపూర్వకంగా ఆమె రాసి ఇచ్చారు.