
ములుగు, జనగామ జిల్లాల్లోవంద శాతం పూర్తి
సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే తుది దశకు చేరింది. జనగామ, ములుగు జిల్లాల్లో గురువారం నాటికి సర్వే ప్రక్రియ నూరుశాతం పూర్తయింది.
నల్లగొండ జిల్లాలో 99.7 శాతం పూర్తి కాగా, కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, నారాయణ్ పేట్, జయశంకర్ భూపాల పల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో 90 శాతానికి పైబడి సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది.
హనుమకొండ జిల్లా (75.7%), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (71.2%) చివరి వరుసలో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 80 శాతానికిపైగా పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా 10 లక్షల ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంది. మొత్తంగా 25,05,517 నివాసాలను గుర్తించగా, ఇప్పటివరకు 15,17,410 నివాసాల్లో సర్వే పూర్తయి, 60.60 శాతం లక్ష్యసాధన జరిగినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment