
ఆగస్టు 5 వరకు..
తొలిసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు
షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే, గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రతిరోజూ సీబీఆర్టీ విధానంలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
తొలిరోజు జూలై 18న స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్‌లో, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు, సెకండ్ షిఫ్ట్‌లో లాంగ్వేజీ పండిట్ (హిందీ) పోస్టులకు పరీక్ష జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment