
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.
కాగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ శుక్రవారం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఇక, మెయిన్స్ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నారు.