తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి.. డాక్టర్‌ ఎలక్షన్స్‌ | Telangana State Medical Council Elections coming soon | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి.. డాక్టర్‌ ఎలక్షన్స్‌

Published Sat, Jul 15 2023 12:56 AM | Last Updated on Sat, Jul 15 2023 5:03 PM

Telangana State Medical Council Elections coming soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌)కి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే సీనియర్‌ వైద్యులు ఎన్నికల ప్రక్రియలో బిజీ అవుతున్నారు. సభ్యులు, చైర్మన్‌ పదవికి పెద్ద సంఖ్యలో వైద్యులు పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. 25 మంది డాక్టర్లతో మండలి ఏర్పాటవుతుంది. అందులో 13 మందిని డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది.

అనంతరం వారిలో నుంచి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చైర్మన్‌ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొనే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 వేల మంది డాక్టర్లు కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ప్రతి ఏటా కొత్తగా మరో మూడు వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇక ప్రతి ఐదేళ్లకోసారి సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా రిజిస్ట్రేషన్‌కు, రెన్యువల్‌కు ఈ నెల 20వ తేదీ గడువుగా నిర్ధారించారు. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. డాక్టర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశముంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 13 మందిని ఓటు ద్వారా ఎన్నుకోనుండటంతో ఓ విధంగా రాజకీయ తరహా వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

ఇక ప్రభుత్వం దాదాపు సగం మంది సభ్యులను నామినేట్‌ చేయనుండటంతో సభ్యులతో పాటు చైర్మన్‌ ఎన్నిక కూడా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు కలిగి ఉన్న వారికే చైర్మన్‌ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 

ఎన్నికల్లో పోటీకి సీనియర్ల సన్నాహాలు 
మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీకి అనేకమంది సీనియర్‌ డాక్టర్లు సమాయత్తమవుతున్నారు. కొందరు వైద్యసంఘాల నాయకులు కూడా పోటీకి సై అంటున్నారు. వీరంతా మద్దతు కోసం ఇప్ప టికే రిజిస్టర్డ్‌ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఆగస్టు 16 లోపు కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. షెడ్యూ ల్‌ విడుదలకు కసరత్తు జరుగుతోంది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ పొందిన ఎవరైనా పోటీచేసే అవకాశముంది. ఒక్కో డాక్టర్‌ 13మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 

ఓటు హక్కుపై ఆందోళన 
ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్, రెన్యువల్‌ చేసుకున్న వారే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని మెడికల్‌ కౌన్సిల్‌ ఇప్పటికే ప్రకటించింది. దీంతో డాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకునేలా ఇటీవల పోర్టల్‌ను ప్రారంభించారు. కానీ అది పనిచేయడం లేదని డాక్టర్లు చెబు తున్నారు.

హైదరాబాద్‌లోని కౌన్సిల్‌కు వ చ్చి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం కౌన్సిల్‌కు ప్రతిరోజూ ఐదారు వందల మంది వస్తుండగా, సగటున 100 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌/రెన్యువల్స్‌ చేయలేకపోతున్నట్లు కౌన్సిల్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో చాలామంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని సీనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డాక్టర్ల నుంచి భారీ స్థాయిలో ఫీజులు తీసుకుంటున్నా, సరైన సౌకర్యాలు కల్పించ డంలో కౌన్సిల్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌ న్సిల్‌ కార్యాలయానికి ఇప్పటికీ పక్కా భవ నం లేకపోవడం, రేకుల షెడ్‌లో నడుస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement