రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదులో 8.97 శాతం పెరిగినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదిక 2023 వెల్లడించింది. 2022లో మొత్తం 1,95,582 కేసులు నమోదు కాగా.. 2023లో 2,13,121 కేసులు నమోదైనట్టు నివేదికలో పేర్కొన్నారు. 2022లో 938 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా 2023లో అది 18 శాతం పెరుగుదలతో 1,108కి చేరింది.
మహిళలపై నేరాలకు సంబంధించి 2022లో 18,075 కేసులు నమోదు కాగా, 2023లో 5.19 శాతం పెరుగుదలతో 19,013 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల కేసులు 4.27శాతం పెరిగాయి. ప్రధాన నేరాల నమోదు, పలు రకాల నేరాల సరళి, తదితర అంశాలపై నివేదికలో పేర్కొన్న కీలక అంశాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్
2023లో శిక్షల ఖరారులో 2 శాతం తగ్గుదల
♦ 2023లో మొత్తం అన్ని రకాల కేసులలో కన్విక్షన్ రేట్ 41 శాతం, 2022లో ఇది 43 శాతంగా ఉంది.
♦ 73 రేప్ కేసులలో 84 మంది నిందితులకు యావజ్జీవ ఖైదు.
♦ పోక్సో చట్టం కింద నమోదైన 87 కేసులలో 104 మంది నిందితులకు శిక్ష పడింది. వీరిలో 41 మందికి జీవిత ఖైదు, నలుగురికి 25 ఏళ్ల జైలు, 58 మందికి 20 ఏళ్ల జైలు, ఒకరికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.
♦ మహబూబాబాద్ పట్టణంలో దీక్షిత్‌రెడ్డి అనే 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసి అనంతరం హత్య చేసిన కేసులో నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష పడింది.
అత్యాచారం కేసులు కారణాల వారీగా..:
♦ మొత్తం కేసులు: 2,284
♦ పెళ్లి పేరుతో మోసం చేసినవి: 1,580 (69.18 శాతం)
♦ పరిచయస్తులు పాల్పడినవి: 307 (13.44 శాతం)
♦ కుటుంబీకులు, బంధువులు చేసినవి: 147 (6.44 శాతం)
♦ గుర్తుతెలియని వ్యక్తులు చేసినవి: 6 (0.26 శాతం)
♦ మిగిలిన కేసులు ఇతర సాంకేతిక అంశాలతో అత్యాచారం కేసుగా నమోదైనవి
హత్యలు కారణాల వారీగా...:
మొత్తం హత్యలు: 789
కుటుంబ కలహాలతో : 176 (22.31 శాతం)
వివాహేతర సంబంధాలతో : 136 (17.24 శాతం)
భూ/ఆస్తి వివాదాల కారణంగా: 89 (11.28 శాతం)
ప్రేమ వ్యవహారాలతో : 18 (2.28 శాతం)
సుపారీ హత్యలు: 8 (1.01 శాతం)
పరువు హత్యలు: 2 (0.25 శాతం)
మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగినవి, ఇప్పటికీ హతులు, హంతకులు గుర్తించనివి ఉన్నాయి.
కిడ్నాప్‌లు కారణాల వారీగా ఇలా..
మొత్తం కిడ్నాప్‌లు : 1,362
ప్రేమ, వివాహేతర సంబంధాలవి : 646 (47.43 శాతం)
మైనర్ల మిస్సింగ్‌వి : 329 (21.15 శాతం)
ఆర్థిక వివాదాల వల్ల : 111 (8.14 శాతం)
అక్రమ నిర్బంధం : 35 (2.56 శాతం)
ప్రతీకారేచ్ఛతో : 26 (1.9 శాతం)
డబ్బు కోసం : 09 (0.66 శాతం)
మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగినవి.
సైబర్ నేరాలపై ఇలా..:
♦ టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన మొత్తం ఫిర్యాదులు – 85,030
♦ నమోదు చేసిన మొత్తం ఎఫ్‌ఐఆర్‌లు – 12,317
♦ సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మురూ.707,25,75,547
♦ పోలీసులు స్తంభింపజేసిన మొత్తం రూ.1,14,72,13,218
♦ బాధితులకు తిరిగి ఇప్పించిన మొత్తం రూ.7,29,32,546
♦ అరెస్టుల సంఖ్య 149
మహిళలపై ప్రధాన నేరాలు నమోదు ఇలా ..:
అత్యాచారం కేసులు 2,284
వరకట్నం హత్యలు 33
వరకట్న వేధింపులతో
మృతులు 132
వరకట్న వేధింపులు 9,458
హత్యలు 213
Comments
Please login to add a commentAdd a comment