జేఈఈ:‌ తెలంగాణ విద్యార్థులే టాప్‌!  | Telangana Students Are Top In JEE Main Exam | Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యార్థులే టాప్‌! 

Published Sat, Sep 12 2020 3:26 AM | Last Updated on Sat, Sep 12 2020 10:34 AM

Telangana Students Are Top In JEE Main Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ను 24 మంది విద్యార్థులు సాధించగా, అందులో 8 మంది రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులే ఉండటం విశేషం.

అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మందికి పైగా..: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది కంటే ఎక్కువ మందినే పరిగణనలోకి తీసుకునేలా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. మరోవైపు శనివారం (12వ తేదీ) మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్, 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది.

ఈనెల 21న ఉదయం 10 గంటల నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనుంది. 27వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి పేపర్‌–2 పరీక్ష ఉంటుంది. వాటి ఫలితాలను అక్టోబర్‌ 5న ప్రకటించనున్నారు. కేటగిరీల వారీగా అడ్వాన్స్‌డ్‌కు అర్హులు వీరే: ఓపెన్‌ కేటగిరీలో 1,01,250, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌లో 25 వేలు, ఓబీసీ నాన్‌ క్రిమీలేయర్‌ 67,500, ఎస్సీ 37,500, ఎస్టీ 18,750.
100 పర్సంటైల్‌ సాధించిన రాష్ట్ర విద్యార్థులు
హాల్‌టికెట్‌ నంబర్‌       విద్యార్థి పేరు 
200310386279    చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి 
200310437355    చుక్కా తనూజ 
200310566235    దీటి యశష్‌చంద్ర 
200310574091    మొర్రడ్డిగారి లిఖిత్‌రెడ్డి 
200310585775    రాచపల్లె శశాంక్‌ అనిరుధ్‌ 
200310594754    రోంగల అరుణ్‌ సిద్ధార్థ 
200310504229    శివకృష్ణ సాగి 
200310226303    వాడపల్లి అర్వింద్‌ నరసింహ

ఏపీ విద్యార్థులు.. 
200310065452 లాండ జితేంద్ర 
200310404791 తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్‌ 
200310145653 వైఎస్‌ఎస్‌ నర్సింహ నాయుడు  

కటాఫ్‌ మార్కులివే.. 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే టాప్‌ 2.5 లక్షల మంది విద్యార్థుల ఎంపికకు జనరల్‌ కేటగిరీలో 90.37 ఎన్‌టీఏ స్కోర్‌ను కటాఫ్‌ మార్కులుగా నిర్ణయించింది. ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ కేటగిరీలో 70.24 స్కోర్‌ను, ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌లో 72.88 స్కోర్‌ను, ఎస్సీలలో 50.17 స్కోర్‌ను, ఎస్టీలలో 39.06 స్కోర్‌ను, వికలాంగులలో 0.06 స్కోర్‌ను కటాఫ్‌ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంది. ఆ స్కోర్, అంతకంటే ఎక్కువ స్కోర్‌ వచ్చినవారే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement