ట్రీ హగ్గర్స్ పేరిట క్లబ్ ఏర్పాటు
11 ఏళ్లుగా యువత కళలకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: కొందరికి హాబీ.. మరికొందరికి ప్యాషన్.. ఇంకొందరికి అభిలాష.. కారణమేదైనా వారందరినీ ఒకే దగ్గరికి చేర్చింది. వారి టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం కలి్పంచింది. వారి ఐడియాలను షేర్ చేసుకునే వీలునిచ్చింది. అదే ది మూన్‌షైన్ ప్రాజెక్టు వేదికగా ఆదివారం ట్రీ హగ్గర్స్ క్లబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేఅఫేయిర్ ప్రోగ్రాం.
టు షో ఆఫ్ స్కిల్స్..
యువతలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చదువుల వెంట పరుగెడుతూ.. వారిలోని ఔత్సాహికతను, నవ్యాలోచనలను బయటపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఇంట్లోని నాలుగు గోడల మధ్యే మిగిలిపోకుండా ఉండేలా వారి స్కిల్స్‌ను చాటిచెప్పేందుకు ఇదో అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. గత 11 సంవత్సరాలుగా ట్రీ హగ్గర్స్ క్లబ్ పేరిట కమర్షియల్ వాసనలకు దూరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుప్రీత అనే ఔత్సాహికురాలు ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు.
టాలెంట్‌ను వెలికితీసేందుకు..
యువతలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ క్లబ్ ఏర్పాటు చేశాం. ఎంతోమంది కళలకు సరైన ప్రోత్సాహం, అవకాశాలు దొరక్కపోవడంతో ఎంతోమంది తెర వెనుకే ఉండిపోతున్నారు. అలాంటి వారి అరుదైన కళలను వెలుగులోకి తీసుకురావాలనేదే మా కోరిక. కమర్షియల్‌గా కాకుండా ఆర్ట్‌లో ఉన్న ఫ్రీడమ్ వారు ఎంజాయ్ చేసేందుకు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తుంటాం.
– సుప్రీత ఆమంచెర్ల, ఫౌండర్, ట్రీ హగ్గర్స్ క్లబ్
ఫ్యాషన్‌తో ప్రారంభం
చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్ వర్క్ చేయడం అలవాటు. ఎప్పుడూ ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను. ఆర్ట్‌లో ఒక ఫ్రీడమ్ ఉంటుందనేది నా భావన. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి డిజైనింగ్ నేర్చుకున్నాను. ఇందులో భాగంగానే లిటిల్ బోటో పేరుతో ప్రాజెక్టు ప్రారంభించాను. కలరింగ్ బుక్స్‌ను స్వయంగా రూపొందిస్తుంటాను.
– విశ్వ సింధూరి నేతి, లిటిల్ బోటో ప్రాజెక్టు
ఇంట్లోనే బేకరీ
చిన్నప్పటి నుంచి చెఫ్ కావాలనేది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే నా ఆలోచనలు ఉండేవి. కాకపోతే బేకరీ ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది. అందుకే నేను నేర్చుకున్న కళతో ఇంటి నుంచే కేక్స్, పేస్టరీస్, కప్ కేక్స్ తయారు చేస్తుంటాను. చాలామంది వారికి నచి్చన థీమ్‌తో కేక్స్ తయారు చేయించుకుంటారు. డబ్బుల కన్నా వాళ్లు నా పనితీరును మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.
–మనిక ఖట్టర్, ఇంపర్ఫెక్షన్ బేకర్స్
Comments
Please login to add a commentAdd a comment