సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.
టీ-యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు గాను విద్యార్థి ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్, ఫోన్ నంబరు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 105 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. www.dost.cgg.gov.in ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి.
►జులై 1 నుంచి 15 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.200
►జులై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు, జులై 22న సీట్ల కేటాయింపు
►జులై 23 నుంచి 27 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400
►జులై 24 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 4న సీట్ల కేటాయింపు
►ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఫీజు రూ.400
►ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 18న సీట్ల కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment