ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదనలు
అనుమతి రాగానే పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అగ్నిమాపక శాఖలో త్వరలో మహిళా ఫైర్ ఫైటర్లు అందుబాటులోకి రానున్నారు. మహిళా సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపకమా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మహిళా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో 400 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా ఫైర్ ఫైటర్స్ నియామకానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఈ పోస్టులలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
విధుల్లో ఉండే ఇబ్బందులను తట్టుకునేలా శారీరక దృఢత్వం, మానసిక సన్నద్ధత ఉంటే మహిళలు సైతం అగ్నిమాపక శాఖలో రాణిస్తారని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఈ విభాగంలో మహిళా సిబ్బంది లేరు. ప్రభుత్వ ఆమోదం వస్తే తెలంగాణలో మొదటి మహిళా అగ్నిమాపక దళం ఏర్పడనుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో అగ్నిమాపక శాఖ విధుల్లో మహిళా సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment