చైతన్య షేక్‌ | - | Sakshi

చైతన్య షేక్‌

Mar 17 2025 9:40 AM | Updated on Mar 17 2025 10:28 AM

చైతన్

చైతన్య షేక్‌

బ్రేక్‌ డ్యాన్స్‌తో

తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని కలలు కనే ఈ రోజుల్లో.. చదువుతో పాటు ఇతర కళల్లోనూ రాణించవచ్చని నిరూపిస్తున్నాడు 9వ తరగతి విద్యార్థి పెంటకోట చైతన్య. అక్కయ్యపాలేనికి చెందిన చైతన్య బ్రేక్‌ డ్యాన్స్‌లో అద్భుతమైన నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చిన్న వయసు నుంచే పిల్లలను ఫౌండేషన్‌ కోర్సుల్లో చేర్పించి, వారి ఆసక్తులను పట్టించుకోకుండా ఆట పాటలకు దూరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో చైతన్య కథ ఒక వెలుగు దివ్వె. తరగతి గది చదువులే కాదు, పిల్లలకు నచ్చిన రంగాల్లో ప్రోత్సాహం లభిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని చైతన్య తన విజయంతో చాటి చెబుతున్నాడు. అతను తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం, అభినందిద్దాం.

– సీతంపేట

ఇది ఏడేళ్ల కిందటి మాట..

వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌లో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటన వచ్చింది. ఇది చూసిన పెంటకోట రాజేష్‌ రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు చైతన్యకు డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించేందుకు శిబిరంలో చేర్పించారు. 45 రోజుల పాటు డ్యాన్స్‌ మాస్టర్‌ సోహెయిల్‌ సింగ్‌ వద్ద చైతన్య శిక్షణ తీసుకున్నాడు. చైతన్యలోని చురుకుదనం, బాడీ లాంగ్వేజ్‌, పట్టుదల, క్రమశిక్షణ చూసిన సోహెయిల్‌ సింగ్‌ ఆశ్చర్యపోయాడు. ఇదే విషయాన్ని రాజేష్‌కు చెప్పాడు. దీంతో కుమారుడిని ఇదే రంగంలో ప్రోత్సహించాలని ఆ తండ్రి నిర్ణయించుకుని సోహెయిల్‌ సింగ్‌ వద్ద శిక్షణ కొనసాగించారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర, జాతీయ స్థాయి బీ–బాయ్స్‌(బ్రేక్‌ డ్యాన్స్‌) పోటీల్లో చైతన్య విజేతగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ముంబయిలో టోర్నడో అనే మాస్టర్‌ వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు.

ఏడేళ్ల

వయసులో

శిక్షణ ప్రారంభించిన

పెంటకోట

చైతన్య

2026

యూత్‌

ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ

చైతన్య షేక్‌1
1/3

చైతన్య షేక్‌

చైతన్య షేక్‌2
2/3

చైతన్య షేక్‌

చైతన్య షేక్‌3
3/3

చైతన్య షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement