● తన 7వ ఏట డ్యాన్స్ శిక్షణ ప్రారంభించిన చైతన్య.. కొన్ని నెలలకే ఒరిజినల్ స్ట్రీట్ డ్యాన్స్ పోటీల్లో 70 మందితో పోటీ పడి విజేతగా నిలిచాడు.
● రాష్ట్ర డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ 2022లో నిర్వహించిన ఏపీ స్టేట్ బ్రేకింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో అండర్–16 విభాగంలో బంగారు పతకం సాధించాడు.
● ఐఐటీ మద్రాస్‌లో 2023 జనవరిలో నిర్వహించిన ఒరిజినల్ స్ట్రీట్ డ్యాన్స్ చాంపియన్‌షిప్ పోటీలో అండర్–16 విభాగంలో విజేతగా నిలిచాడు.
● అమెచ్యూర్ డ్యాన్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 డిసెంబర్‌లో నిర్వహించిన 3వ నేషనల్ బ్రేకింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆల్ ఇండియా 8వ ర్యాంకుతో ప్రతిభ చాటాడు.
● 2024 జూన్‌లో నిర్వహించిన నాలుగో నేషనల్ బ్రేకింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆల్ ఇండియా 8వ ర్యాంకు సాధించాడు.
● వరల్డ్ డ్యాన్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్‌లో చైనాలో జరిగిన 5వ వరల్డ్ యూత్ బ్రేకింగ్ చాంపియన్‌షిప్ పోటీలో 122వ వరల్డ్ ర్యాంక్ సాధించి అబ్బురపరిచాడు. ఈ పోటీల్లో ఇండియా నుంచి నలుగురు పాల్గొనగా.. చైతన్య ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
● బ్రేక్ డ్యాన్సింగ్‌లో అథ్లెట్‌గా యూఎస్‌ఏ గుర్తింపు కార్డు ఇచ్చింది. ఈ గుర్తింపుతో ప్రపంచంలోని ఏ దేశంలో జరిగే పోటీల్లోనైనా చైతన్య పాల్గొనడానికి అవకాశం దక్కింది.
● 2025 నవంబర్‌లో ఇండోనేషియాలో, ఆ తర్వాత చైనాలో మరోసారి జరగనున్న పోటీల్లో ప్రతిభ చూపితే 2026 డాకర్‌లో జరిగే యూత్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం చైతన్యకు లభిస్తుంది.