
ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా నరేష్
విశాఖ లీగల్: ఇండియన్ లాయర్స్ అసోసియేషన్(ఐఎల్‌ఏ) విశాఖ జిల్లా అధ్యక్షుడిగా యడ్ల నరేష్(వై.వి.ఎల్.ఎన్.రావు) నియమితులయ్యారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంతకుమార్ నియామక పత్రాన్ని నరేష్‌కు అందజేశారు. ఐఏఎల్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, మహిళా న్యాయవాదులకు సంస్థలో తగిన ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేస్తానని నరేష్ తెలిపారు. న్యాయవాదులకు ఇస్తున్న డెత్ బెనిఫిట్స్‌ను కనీసం రూ.10 లక్షలకు పెంచే విధంగా పోరాటం చేస్తానన్నారు.