
విశాఖ మహిళా కళాశాలకు హెచ్‌పీసీఎల్ విరాళం
మహారాణిపేట: విశాఖ మహిళా కళాశాల అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హెచ్‌పీసీఎల్ రూ.50 లక్షల విరాళం అందించింది. ఆ సంస్థ సీజీఎం జి.కిరణ్ కుమార్, విశాఖ రిఫైనరీ ఈడీ ఆర్.రామకృష్ణన్, అధికారి శ్రీనివాసరావు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను తన చాంబర్‌లో కలిసి చెక్కును అందజేశారు. విశాఖ మహిళా కళాశాలలో టాయిలెట్ బ్లాక్ ఆధునికీకరణ, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉపయోగించాలని కళాశాల అధికారులకు కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, సీపీఓ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.