పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు | - | Sakshi

పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు

Apr 10 2025 12:53 AM | Updated on Apr 10 2025 12:53 AM

పంట ప

పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు

గోపాలపట్నం: నరవ వెళ్లే రహదారిలోని కంపరపాలెం పంట పొలంలో వందలాది ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులు గుట్టలుగా పడి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. బుధవారం స్థానికులు వీటిని గుర్తించారు. ఈ కార్డులన్నీ మాధవధార, మురళీనగర్‌ ప్రాంతాలకు చెందిన వారివి కావడం గమనార్హం. పొలంలో గుర్తింపు కార్డులతో పాటు మద్యం సీసాలు, లైటర్లు కూడా లభ్యమయ్యాయి. ఈ సంఘటనతో స్థానికుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కార్డులు అసలైనవా లేదా నకిలీవా.? ఇంత పెద్ద సంఖ్యలో గుర్తింపు కార్డులు పొలాల్లో ఎలా ప్రత్యక్షమయ్యాయి? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మంది ఆకతాయిలు మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వారే ఈ కార్డులను పడేసి ఉంటారా? లేదా ఆధార్‌ కేంద్రాలు నిర్వహించే వారు ఈ పని చేసి ఉంటారా? సైబర్‌ నేరగాళ్ల పనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు స్పందించి, ఇన్ని కార్డులు ఇక్కడకు ఎలా వచ్చాయో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు 1
1/2

పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు

పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు 2
2/2

పంట పొలంలో వందలాది ఆధార్‌ కార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement