
సర్వజన మనోరంజనిపై అప్పన్న తిరువీధి
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు గురువారం స్వామికి సర్వజన మనోరంజని వాహనంపై విశేషంగా తిరువీధి నిర్వహించారు. స్వామివారి కల్యాణ ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వజన మనోరంజనిపై వేంజేపచేశారు. సింహగిరి మాడ వీధుల్లో తిరువీధి జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది. అంతకుముందు ఉదయం విశేషంగా హోమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ పాల్గొన్నారు.