
జాతీయ స్థాయిలో ఏయూ విద్యార్థిని ప్రతిభ
విశాఖ విద్య: జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగానికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని కోన మహాలక్ష్మి జాతీయ స్థాయిలో రెండో బహుమతిని గెలుచుకున్నారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం ధార్వాడకు చెందిన సెంటర్ ఫర్ మల్టీ డిసిప్లినరీ డెవెలప్‌మెంట్ రీసెర్చ్ ఈ పోటీలు నిర్వహించింది. ధార్వాడలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య బసవప్రభు జిర్లి చేతుల మీదుగా విద్యార్థిని మహాలక్ష్మికి రూ.7 వేలు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. మహాలక్ష్మి రాసిన వ్యాసం ‘భారతీయ పురాతన విజ్ఞానం ప్రాతిపదికన ప్రాచీన సంప్రదాయాలు సమకాలీన సమస్యల’ అనే అంశంపై ఆమె జాతీయ స్థాయిలో రెండో బహుమతిని పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ. నరసింహారావు.. మహాలక్ష్మిని అభినందించారు.