
ఇంటర్‌లో బాలికలదే హవా
ఫస్టియర్ సెకండియర్
బాలురు 77 శాతం 75 శాతం
బాలికలు 82 శాతం 85 శాతం
విశాఖ విద్య: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని 188 జూనియర్ కాలేజీల నుంచి ఫస్టియర్ (జనరల్) 40,098 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 31,866 మంది పాసయ్యారు. తద్వారా 79 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. సెకండియర్‌కు 36,479 మంది హాజరవ్వగా 31,761 మంది పాసయ్యారు. 87 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫస్టియర్‌లో బాలురు 77 శాతం పాసవ్వగా బాలికలు 82 శాతం పాసయ్యారు. సెకండియర్‌లో బాలురు 86 శాతం పాసవ్వగా బాలికలు 89 శాతం ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో బాలురు 48 శాతం పాసవ్వగా బాలికలు 77 శాతం పాసయ్యారు. సెకండియర్‌లో బాలురు 75 శాతం పాసవ్వగా బాలికలు 85 శాతం ఉత్తీర్ణత పొందారు. మొత్తంగా గతేడాది కంటే జిల్లాలో ఉత్తీర్ణత శాతం కొద్దిగా పెరిగింది. ఫస్టియర్‌లో రాష్ట్ర సూచికలో 4వ స్థానం, సెకండియర్‌లో 6వ స్థానం దక్కింది.
రీ వాల్యూయేషన్‌కు అవకాశం
ఫలితాలపై విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే రీ వాల్యూయేషన్‌కు అవకాశం కల్పించారు. రీ వాల్యూయేషన్ కోరే విద్యార్థులు రూ.260 ఫీజు చెల్లించి ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా రీ వెరిఫికేషన్ కోసం రూ.1,300లు ఫీజు చెల్లించాలి.
మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. విద్యార్థులు నిర్ణీత ఫీజుతో ఈ నెల 15 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. భీమిలి కేజీబీవీకి చెందిన ఎస్.ప్రణతి బైపీసీ ఫస్టియర్‌లో 440 మార్కులకు గాను 434 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ జోగ చంద్రశేఖర్ రావు తెలిపారు. కేజీబీవీ ఆనందపురానికి చెందిన నమ్మి వసంత ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో 975 మార్కులు సాధించింది. కేబీవీబీ ఆనందపురంలో ఫస్టియర్ 67 శాతం, సెకండియర్ 85 శాతం, భీమునిపట్నంలో ఫస్టియర్ 78 శాతం, సెకండియర్ 97 శాతం, పద్మనాభం కేజీబీవీలో ఫస్టియర్ 41 శాతం, సెకండియర్ 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
ఫస్టియర్‌లో 79, సెకండియర్‌లో 87 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా