
ఇంటర్ ఫలితాల్లో శశి విద్యార్థుల సత్తా
తగరపువలస: ఇంటర్ ఫలితాల్లో సంగివలస బ్రాంచ్‌కు చెందిన తమ విద్యార్థులు విశేష ప్రతిభ చూపారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎంపీసీ సెకండియర్ లో 699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 697 మంది పాసై 99.7 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బోని పూజత అత్యధికంగా 991 మార్కులు సాధించింది. బైపీసీలో 122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా శత శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెంటు యామిని 988 మార్కులు సాధించింది. ఎంపీసీ ఫస్టియర్‌లో 535 మంది పరీక్షలకు హాజరుకాగా 525 మంది పాసై 98.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హెచ్.తేజస్విని, కె.నిరీక్షణ్, లంకా గౌతమ్, ఎం.లాస్య, చింతల కస్యప్, సలాది మోనిష 466 మార్కులు పొందారు. బైపీసీలో 137 మంది విద్యార్థులకు గాను శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. కె.ప్రణయ్ 436 మార్కులు పొందాడు. వీరిని వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, కరస్పాండెంట్ మేకా క్రాంతిసుధ తదితరులు అభినందించారు.