
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందే..
డాబాగార్డెన్స్: వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలంటూ ముస్లింలు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు చేపట్టిన ఈ శాంతియుత ర్యాలీలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కితీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్ గౌస్ ముద్దిన్ ఖాన్, ముస్లిం నాయకులు హైదర్ అలీ సింకా, జహీర్ అహ్మద్, ఆల్ మాస్క్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ మున్నీర్, యాసిన్ మసీద్ అసిస్టెంట్ సెక్రటరీ మహమ్మద్ ఇబ్రహీం, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఫరూఖీ, తదితరులు పాల్గొన్నారు.