పగిలిన గుండెలు | - | Sakshi
Sakshi News home page

పగిలిన గుండెలు

Apr 14 2025 1:42 AM | Updated on Apr 14 2025 1:42 AM

పగిలి

పగిలిన గుండెలు

ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12.30 గంటల సమయం..ఒకవైపు మండుతున్న సూర్యుడి భగభగలు.. మరోవైపు సెగలు కక్కుతున్న వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులు.. ఊపిరి సలపని పని.. కడుపు ఆకలితో నకనకలాడుతోంది.. కాసేపట్లో పని చాలించిఓ ముద్ద తిని వద్దాం.. అనుకుంటుండగా.. ఒక్కసారిగా భూమి దద్దరిల్లిన శబ్దం. దిక్కులు పిక్కటిల్లేలా కార్మికుల హాహాకారాలు.. క్షణకాలంలో తునాతునకలైన దేహాలు.. పూర్తిగా కాలిపోయిన శరీరాలు.. కాలిన గాయాలతో బాధితుల పెడబొబ్బలు.. ఒక్కసారిగా భీతిగొలిపే దృశ్యాలతో ఆ ప్రాంతం రక్తకాసారంగా మారిపోయింది. ఏం జరిగిందోతెలిసేలోగానే ఎనిమిది మంది అక్కడికక్కడే బుగ్గయిపోయారు.. మరో ఎనిమిది మంది క్షతగాత్రులుగా మారిపోయారు.. కోటవురట్ల మండలం కై లాసపట్నం సమీపంలోని విజయలక్ష్మి ఫైర్‌ వర్క్స్‌లో సంభవించిన ఘోరప్రమాదం దృశ్యమిది.
● మధ్యాహ్నం 12.30 గంటలకు భారీగా పేలుడు ● ఎనిమిది మంది దుర్మరణం, మరో ఎనిమిది మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం ● ప్రమాద సమయంలో కేంద్రంలో 16 మంది కార్మికులు ● విశాఖపట్నం, నర్సీపట్నం ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు ● పదేళ్ల క్రితం గోకులపాడులో ఇదే పరిశ్రమలో ప్రమాదం ● ఆ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం ● మళ్లీ దశాబ్దం తరువాత అదే ఘోర కలి ● భద్రతా తనిఖీల్లో లోపం...కార్మికులకు శాపం

కొంపముంచిన ఆర్డర్‌

గ్రామాల్లో వివిధ పండుగలు ఉన్నాయి. బాణసంచా సామగ్రి కావాలి అని ఆర్డర్‌ వచ్చింది. దీంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. సెలవయినా ఆదివారం కూడా పనిచేశారు. పని ఒత్తిడిలో నిప్పు రవ్వలు వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రవ్వల వల్ల పేలుడు జరిగి ఉండవచ్చు. ఈ సంఘటనలో బాణసంచా కంపెనీ యాజమాని కూడా గాయపడ్డారు. – అప్పారావు,

నాగరాజు మేనల్లుడు, కై లాసపట్నం

ప్రమాద స్థలంలో భీతావహ దృశ్యాలు...

టన సమయంలో మందుగుండు సామగ్రి దంచుతున్న మనోహర్‌ అనే వ్యక్తి తునాతునకలయ్యాడు. భారీ పేలుడుకు తల, కుడి చేయి ఎగిరిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురు శరీరాలు పూర్తిగా కాలిపోయి విగతజీవులుగా కనిపించారు. ఇక గాయపడిన 8 మందిలో నాగరాజు (52)కు 90 శాతం కాలిన గాయాలతో, జానకీరాం (50)కు 60 శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : పొట్టకూటి కోసం మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు వెళ్లిన పలు వురు కార్మికులు ఆ మందుగుండుకే ఆహుతయ్యారు. బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పేద కార్మిక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన విస్ఫోటనం 8 మంది కార్మికుల ప్రాణాలను మింగేసింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రామస్తులంతా ఇళ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించి అగ్ని ప్రకంపనలు సృష్టించినట్టుగా చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో గల బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు ధాటికి గ్రామస్తులు భీతావహులయ్యారు. మంటలు ఎగిసిపడుతుంటే ఆవైపు వెళ్లాలంటే భయం..మరో వైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైర్‌ ఇంజన్‌, 108కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదం జరిగిందిలా...

కై లాసపట్నంనకు చెందిన మడగల జానకీరాం తన తోడల్లుడు అప్పికొండ తాతబ్బాయి పేరున ‘విజయలక్ష్మి ఫైర్‌వర్క్స్‌’ మందుగుండు తయారీకి లైసెన్సు తీసుకుని 20 ఏళ్లుగా కేంద్రాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్‌కు వచ్చే ఏడాది 2026 వరకు గడువు ఉంది. దీపావళితో పాటు సమీప మండలాల్లో పల్లెల్లో జరిగే గ్రామ పండుగలకు వచ్చే ఆర్డర్లపై మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. కొత్త అమావాస్య నుంచి వరుసగా పల్లెల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వర్క్‌లోడ్‌ ఎక్కువగా ఉండడంతో కార్మికులు ఒత్తిడితో పనిచేస్తున్నారు. సరిగ్గా 12.30 గంటల సమయంలో ఓ కార్మికుడు మందును దంచుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. వారం రోజులుగా తయారు చేసిన మందుగుండు సామగ్రి మొత్తం అక్కడే ఉండడంతో ఒక్కొక్కటిగా క్షణాల్లో అంటుకుపోయాయి. పక్కనే ఉన్న పౌడర్‌పై అగ్గి రేణువులు తూలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పనిచేస్తున్న కార్మికులు తేరుకుని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్రంగా కాలిపోయి 8 మంది కార్మికులు అక్కడికక్కడే మాడి మసైపోయా రు. విస్ఫోటనం ధాటికి అక్కడ ఉన్న రేకుల షెడ్లు, రెండు చిన్న స్లాబ్‌ గదులు చెల్లా చెదురయ్యాయి. భూమి కంపించినట్టయి..పెద్దగా మంట రావడంతో గ్రామస్థులంతా అదిరిపడి ఒక్కసారిగా పరుగున వచ్చారు. వరహాలు అనే గ్రామస్తుడు ఫైర్‌ ఇంజిన్‌, 108కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం, నక్కపల్లి, కోటవురట్ల, ప్రభుత్వ ఆస్పత్రి 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సమీప నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నుంచి మూడు ఫైర్‌ ఇంజిన్‌లు వచ్చాయి. మంటలు అదుపు చేయడానికి సుమారు 4 గంటల పాటు సమయం పట్టింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని కేజీహెచ్‌కు తరలించారు. మైనర్‌ గాయాలతో ఉన్న వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ఏం చేయాలో ఆలోచించాలి

క్రీడల ద్వారానే మనం గుర్తింపు పొందాం. ఉన్నత స్థితికి ఎదిగాం. ఒకప్పుడు మనకు క్రీడల్లో శిక్షణ ఇచ్చిన గురువులను ఇప్పటికీ గౌరవిస్తున్నాం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు హాస్టల్స్‌ నుంచి కిట్లు, ఆర్థిక సహాయం పొందాం. ఇప్పుడు ఆ సహాయాన్ని ఈ తరం వారికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందుకోసం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. –క్రీడల్లో డాక్టరేట్‌ అందుకున్న అనిత

అథ్లెట్లు.. తీరప్రాంతాల వారే..

భారతదేశం గర్వించద గ్గ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లలో చాలా మంది తీర ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. 1980లో క్రీడా హాస్టల్స్‌ను స్థాపించడం వల్ల ఎంతో మంది ప్రతిభావంతులకు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం లభించింది. క్రీడలను మరింతగా ప్రోత్సహించడానికి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం అవసరం.

– రామిరెడ్డి, అంతర్జాతీయ అథ్లెట్‌, విశాఖ

సాక్షి, విశాఖపట్నం : నగరం నిప్పుల కొలిమిలా మారింది. రెండు రోజులుగా కాస్తున్న ఎండ నడివేసవిని తలపించింది. రోహిణి రాకముందే.. రోళ్లు పగిలిపోతున్నాయి. నగరంలో రెండు రోజులుగా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. సెగలు కక్కిన భానుడి భగభగల ధాటికి నగరవాసుల నాలుక పిడచకట్టుకుపోతుంది. ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే మార్చి నెలాఖరు నుంచే నగరంలో సెగలు పెరిగాయి. ఏప్రిల్‌ రెండో వారానికి తారాస్థాయికి చేరుకుంది. గత రెండు రోజులుగా సాయంత్రం సమయంలో మేఽఘావృత వాతావరణంతో కాసింత ఊరట చెందుతున్నా.. ఉదయం కాస్తున్న ఎండకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోత విపరీతంగా ఉంది. వేడిగాలులు వస్తుండటంతో.. వాహనదారులు, ప్రయాణికులు ఆపసోపాలు పడుతున్నారు. ఈసారి జీవీఎంసీ చలివేంద్రాల ఏర్పాటులో విఫలమైంది. చలివేంద్రాల కోసం టెంట్లు మాత్రమే వేశారు తప్ప నీటిని అందుబాటులో ఉంచలేదు.

అకాల వర్షాల ప్రభావంతో..

వేసవి మొదలైన సమయంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శివారులో చుట్టుపక్కలా వర్షాలు కురవడం, నగర పరిధిలో వానలు ఆశించిన స్థాయిలో పడకపోవడం కూడా ఈ విపరీత వాతావరణానికి ఒక కారణమంటున్నారు. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గాలిలో తేమ మొత్తం ఆవిరైపోయింది. దీంతో వాతావరణం పొడిబారిపోవడం వల్ల పరిస్థితి దారుణంగా మారింది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు 37, 38 డిగ్రీలకు నమోదవుతున్నా.. ఉష్ణతాపం మాత్రం 45 నుంచి 50 డిగ్రీల వరకూ ఉంటోందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతుండటం వల్ల.. ఈ ఎండ ధాటికి నీటి ఆవిరి మళ్లీ పెరగనుందనీ.. ఫలితంగా భవిష్యత్తులో వేడి వాతావరణం మరింత కలవరపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని.. ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

విశాఖ స్పోర్ట్స్‌: అర్ధ శతాబ్దం కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్రీడా వసతి గృహాల్లో శిక్షణ పొంది.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా జరిగింది. ఏపీ స్పోర్ట్స్‌ హాస్టలర్స్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో ‘రీయూనియన్‌’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పొందిన వారిలో కొంత మంది మరణించగా.. వారికి సంతాపం తెలిపారు.

గత వైభవం.. నేటి వాస్తవాలు

1980లో ప్రారంభమై 2003 వరకు కొనసాగిన క్రీడా వసతి గృహాలు.. ఎందరో ప్రతిభావంతులను దేశానికి అందించాయి. కాలక్రమేణా ఇవి క్రీడా అకాడమీలు గా, ప్రస్తుతం ఖేలో ఇండియా, సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లుగా రూపాంతరం చెందాయి. వసతి గృహాల్లో శిక్షణ పొందిన చాలా మంది క్రీడాకారులు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సైతం సైకిల్‌పై వచ్చి తమకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన వైనాన్ని, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తమకు స్పోర్ట్స్‌ అథారిటీ కిట్లు అందించి ప్రోత్సహించడాన్ని గుర్తు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు షూల తో సాధన చేస్తే.. గ్రామీణ క్రీడాకారులు చెప్పులతో సాధన చేసి ఆత్మస్థైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణించినట్లు చెప్పారు. అయితే నాటి, నేటి పరిస్థితులకు చాలా తేడా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం క్రీడల కంటే చదువుకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, సరైన వసతులు లేకపోవడం వంటి కారణాల వల్ల పతకాలు సాధించడం కష్టతరంగా మారిందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన ఈ క్రీడాకారులు గతంలో హైదరాబాద్‌ వేదికగా మూడు సార్లు కలిసినప్పటికీ.. విశాఖలో కలవడం ఇదే తొలిసారి. తమ క్రీడా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకున్న ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ప్రముఖుల సత్కారం

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్‌ పి.వి.జి.ఆర్‌ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి క్రీడాకారుల అనుభవాలు రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఒక పతకం సాధించడం వెనుక ఎంతో శ్రమ, గుర్తింపు ఉంటాయని, తాను కూడా జాతీయ శిబిరాల్లో క్రీడాకారులతో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. త్వరలో విశాఖ సాగర తీరంలోని బ్యాంక్డ్‌ రింక్‌లో ఆసియన్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎడ్వర్డ్‌, ఎందరో అథ్లెట్లను తీర్చిదిద్దిన కోచ్‌ ఖాసీం, ఎస్‌ఏఎఫ్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన రామిరెడ్డి, డాక్టరేట్లు సాధించిన క్రీడాకారులను నిర్వాహకులు సత్కరించారు.

11 మంది పని చేస్తున్నారు

ప్రతిరోజూ అక్కడ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తారు. బాణసంచా కేంద్రంలో ప్రమాద ఘటన జరిగే సమయానికి 16 మంది మాత్రం ఉన్నారు. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం కోటవురట్ల మండలంలో అన్నవరం, చౌడువాడ, పందూరు గ్రామాల్లో గ్రామ జాతర ఉత్సవాలు ఉండడంతో బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో గత వారం రోజులుగా పని ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో అక్కడ పనిచేసే సామర్లకోటకు చెందిన ఒక కుటుంబం సంతకు వెళ్లేందుకు ఓనర్‌ నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. దీంతో అక్కడ పనిచేసే 11 మందితో పాటు ఈ అయిదుగురూ ప్రమాదంలో గాయపడ్డారు.

బాణసంచా కేంద్రంలో బతుకులు బుగ్గి కై లాసపట్నంలో ఘోర విషాదం

ఆ రోజుల్లో..

సైకిళ్లపై గురువులొచ్చి శిక్షణనిచ్చేవారు

చెప్పులతోనే సాధన చేసే వాళ్లం

నాటి జ్ఞాపకాలను పంచుకున్నక్రీడా దిగ్గజాలు

1980–2003 ‘హాస్టల్‌’ క్రీడాకారులఅ‘పూర్వ’కలయిక

క్రీడాకోటా అమలు చేయాలి

క్రీడాకారులకు ఉద్యోగాల్లో రెండు శా తం రిజర్వేషన్‌ కచ్చితంగా అమలు చేయాలి. క్రీడల్లో రాణించిన వారి కి తగిన గుర్తింపు లభించాలి. మన క్రీడాకారులు జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికలపై రెపరెపలాడించేలా నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి. ప్రాథమికస్థాయిలో క్రీడా వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– కోటేశ్వరరావు, డీఎస్పీ

ఆదివారం నమోదైనగరిష్ట ఉష్ణోగ్రతలు

భీమిలి 39.0 డిగ్రీలు

సింహాచలం 38.1

గాజువాక 37.4

మహారాణిపేట 37.0

షీలానగర్‌ 36.0

ఆరిలోవ 35.6

ద్వారకానగర్‌ 35.4

మౌలిక సదుపాయాలు అవసరం

ఆటల్లో శిక్షణ ఎంత ముఖ్యమో.. టోర్నీల్లో పాల్గొనడం కూడా అంతే అవసరం. నేను 1974లో ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టాను. ఆ తర్వాత హాస్టల్‌లో మొదటి బ్యాచ్‌లోనే శిక్షణ ద్వారా ఆటలో మెరుగులు దిద్దుకున్నాను. అప్పట్లో ఒలింపియన్స్‌ కూడా ఉదయం ఐదు గంటలకే సైకిల్‌పై వచ్చి మరీ శిక్షణ ఇచ్చేవారు. నేడూ అలాంటి నిబద్ధత అవసరం. క్రీడా సదుపాయాలు మరింతగా అభివృద్ధి చెందాలి. అప్పుడే భవిష్యత్‌ తరాలు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోగలవు. – వెంకటేశ్వర రెడ్డి, తొలి బ్యాచ్‌ శిక్షణార్థి

పగిలిన గుండెలు1
1/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు2
2/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు3
3/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు4
4/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు5
5/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు6
6/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు7
7/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు8
8/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు9
9/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు10
10/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు11
11/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు12
12/13

పగిలిన గుండెలు

పగిలిన గుండెలు13
13/13

పగిలిన గుండెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement