
ప్రైవేట్ ఆస్పత్రికి ఇద్దరి తరలింపు
● కేజీహెచ్‌లో నలుగురికి వైద్య సేవలు ● నర్సీపట్నంలో కోలుకుంటున్న ఇద్దరు
మహారాణిపేట /నర్సీపట్నం: కై లాసపట్నం ప్రమాదంలో గాయాలైన నలుగురు క్షతగాత్రులకు కేజీహెచ్‌లో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న ఫైర్ వర్క్స్ మేనేజర్ మడగల జానకీరాం, సియ్యాద్రి గోవిందలను మెరుగైన వైద్య కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మొత్తం ఆరుగురు క్షతగాత్రులను తీసుకొని వచ్చి కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్పించారు. తీవ్రంగా గాయపడ్డ జల్లూరి నాగరాజుకు సీఎస్‌ఆర్ బ్లాక్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగరాతి శ్రీను, గుప్పెన సూరిబాబు కోలుకుంటున్నారు.