పకడ్బందీగా ఉచిత విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఉచిత విద్యుత్‌

Published Tue, Jun 25 2024 1:44 AM | Last Updated on Tue, Jun 25 2024 1:44 AM

పకడ్బ

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ అచ్చంపేట/ దోమలపెంట/ మన్ననూర్‌: రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అని, అందుకు శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ కల్పించడంపై పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరుసగా ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పథకం అమలులో కొంత జాప్యం జరిగిందని, ఇప్పటి వరకు అర్హులు ఎవరైనా విద్యుత్‌ బిల్లులు చెల్లించి ఉంటే వారి డబ్బులను ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పర్ణికారెడ్డిలతో కలిసి శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి డిప్యూటీ సీఎం మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైడల్‌ ప్రాజెక్టు ద్వారా పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఆనాటి కాంగ్రెస్‌ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన శ్రీశైలం బహుళార్ధక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నింపిన అమరజీవులకు నివాళులర్పించారు. శ్రీశైలం హైడల్‌ ప్రాజెక్టు ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హైడల్‌ ప్రాజెక్టులో 4వ యూనిట్‌ పునరుద్ధరణ కోసం టెండర్‌ ఫర్‌ కాల్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిట్‌ పునరుద్ధరణలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థలను బ్లాక్‌ లిస్టులో చేర్చాలని సూచించారు. 2020లో భూగర్భ పవర్‌ హౌజ్‌లో జరిగిన ప్రమాద ఘటన తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమావేశంలో జెన్కో సీఎండీ రిజ్వీ, భూగర్భ కేంద్రం ఎస్‌ఈ ఓఅండ్‌ఎం ఆదినారాయణ, ఎస్‌ఈ సివిల్‌ రవీంద్రకుమార్‌, జూరాల ఎస్‌ఈ రామసుబ్బారెడ్డి, ఎస్‌పీఎఫ్‌ ఏసీ ఎంఎస్‌ రెడ్డి, ఆర్‌ఐ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

నల్లమలకు విచ్చేసిన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు దారిపొడవునా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మన్ననూర్‌లోని వనమాళిక ప్రాంగణంలో పోలీస్‌లు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అంతకు ముందు మన్ననూర్‌ కూడలిలో నిరంజన్‌షావలి దర్గా, లింగమయ్యస్వామి ఆలయంలో రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేఘారెడ్డి తదితరులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే ఆదివాసీ కార్పొరేషన్‌లో చెంచు తెగలకు నామినేట్‌ విధానంలో రెండు డైరెక్టర్‌ పోస్టులు కేటాయించాలని చెంచు సేవా సంఘం నాయకులు కోరారు. అలాగే మహిళా సమాఖ్య ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధ్యాయ, అంగన్‌వాడీ సమస్యలపై సైతం మంత్రికి వినతిపత్రం అందించారు.

అబద్ధపు ప్రచారాలు

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలున్నాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, రెప్పపాటు కరెంట్‌ కోతలు కూడా లేవని భట్టి అన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జన్సీకి 108 ఉన్నట్లే విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 1912 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని, విద్యుత్‌ సమస్యలపై ఈ నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన అచ్చంపేట మండలం ఘన్‌పూర్‌కు గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును డిప్యూటీ సీఎం అందజేశారు.

తెలుగు ప్రజల జీవితాల్లో

వెలుగులు నింపాలి

జల విద్యుత్‌ నాలుగో యూనిట్‌పునరుద్ధరణకు టెండర్లు

శ్రీశైలం హైడల్‌ ద్వారా పెద్దఎత్తునవిద్యుదుత్పత్తిపై సుదీర్ఘ సమీక్ష

రాష్ట్రంలో రెప్పపాటు కరెంట్‌ కోతలు లేకుండా చర్యలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

No comments yet. Be the first to comment!
Add a comment
పకడ్బందీగా ఉచిత విద్యుత్‌
1/1

పకడ్బందీగా ఉచిత విద్యుత్‌

Advertisement
 
Advertisement
 
Advertisement