దేవాదాయశాఖలో కదలిక | - | Sakshi
Sakshi News home page

దేవాదాయశాఖలో కదలిక

Published Tue, Jun 25 2024 1:44 AM | Last Updated on Tue, Jun 25 2024 1:44 AM

దేవాదాయశాఖలో కదలిక

ధూపం, దీపం, నైవేద్యం సమర్పయామిపైఉన్నతాధికారుల ఆరా

లేని ఆలయానికి పథకంవర్తింపచేయడంపై విస్మయం

కమిషనర్‌ ఆదేశాలతో

గోప్యంగా సాగుతున్న విచారణ

తప్పించుకునేందుకు

అవినీతి అధికారుల తంటాలు

రాజకీయ నేతలతో సంప్రదింపులు

రాష్ట్రస్థాయి అధికారులపై

ఒత్తిళ్లు తెచ్చేలా చర్యలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: దేవాదాయశాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ధూప, దీప, నైవేద్య పథకంలో అవినీతి పర్వంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ పథకం కింద అర్చకులకు ప్రభుత్వం నెలకు రూ.10వేల గౌరవ వేతనం ఇస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో పలువురు పాలకమండలి సభ్యులు, పెద్దలు కొందరు అర్చకులపై ఒత్తిడి తెచ్చి కమీషన్‌ ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో గత నెల 30న ‘అయ్యగార్లకే శఠగోపం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిబంధనలు విస్మరించి లేని ఆలయాలకు సైతం ధూప, దీప నైవేద్య పథకం వర్తింపచేయడంపై ‘ద్యేవుడా.. ధూపం, దీపం, నైవేద్యం సమర్పయామి..!’ శీర్షికన ఈ నెల 22న మరో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ పథకంలో అవినీతి కొనసాగిన తీరు, ప్రజాధనం వృథా కావడంపై పలు ఉదాహరణలతో కథనాలు ప్రచురితం కాగా.. దేవాదాయశాఖలోని రాష్ట్రస్థాయి అధికారులు స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆశాఖ కమిషనర్‌ ఆదేశించారు.

‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలు

రామకృష్ణకు విచారణ బాధ్యతలు

ప్రఽదానంగా లేని ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం అమలు చేసిన అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యమా.. ధన దాహంతో ఈ విధంగా చేశారా.. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనేనా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా కొనసాగిందా.. అనే దానిపై క్షేత్రస్థాయిలో కూపీ లాగాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ముందుగా ఉమ్మడి జిల్లాలోని పులికల్‌లో చోటుచేసుకున్న వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఇందుకు దేవాదాయశాఖలో హైదరాబాద్‌ పరిధిలో ఆర్‌జేసీ (రీజియన్‌ జాయింట్‌ కమిషనర్‌)గా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణను విచారణ అధికారిగా నియమించారు. ఇప్పటికే ఆయన గుట్టుచప్పుడు కాకుండా తన విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే దానిపై ఆయన ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. త్వరలో క్షేత్రస్థాయిలో పులికల్‌లో పర్యటించి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement