అవినీతి ఉద్యోగుల్లో గుబులు.. | - | Sakshi
Sakshi News home page

అవినీతి ఉద్యోగుల్లో గుబులు..

Published Tue, Jun 25 2024 1:46 AM | Last Updated on Tue, Jun 25 2024 1:46 AM

-

లేని ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం అమలు చేయడంపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న విచారణతో దేవాదాయశాఖలోని అవినీతి అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ మేరకు తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు వారి చర్యలను బట్టి తెలుస్తోంది. పలు జిల్లాల్లో తనకు అనుకూలంగా ఉన్న అర్చకులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం. తమకేమైనా జరిగితే మీకు ధూప, దీప, నైవేద్య పథకం కింద నెలకు రావాల్సిన రూ.10 వేలు రావని బెదిరింపులకు దిగుతున్నట్లు వినికిడి. అదేవిధంగా తన కున్న పరిచయాలతో రాజకీయ నేతలను సంప్రదించడమే కాకుండా.. వారితో ఉన్నతాధికారుల పై ఒత్తిళ్లు తెచ్చే విధంగా ముందుకు సాగుతున్న ట్లు ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విచారణ చేపట్టాం..

పులికల్‌లో రంగనాథస్వామి ఆలయం పేరిట ఇంట్లో ఉన్న గదికి ధూప, దీప, నైవేద్య పథకం అమలు చేయడంపై విచారణకు ఆదేశించాం. వారంలో నివేదిక ఇవ్వాలని సూచించాం. అది అందగానే తగిన చర్యలు తీసుకుంటాం.

– కృష్ణవేణి, అడిషనల్‌ కమిషనర్‌, దేవాదాయ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement