Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Fires On Chandrababu: Andhra pradesh1
అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాది అని.. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలు­చు­కుని రాజకీయాలు చేయరని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చిని లాక్కోవాలని చూస్తున్నారనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచారు.పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అంటూ ఎత్తిచూపారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరికొంత మంది పోలీసులు.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్‌ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పన్నాగాన్ని సాక్ష్యాధారాలతో వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ⇒ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచి్చంది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్‌ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్‌ చేసి, వైఎస్సార్‌సీపీ తరఫున పని చేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.⇒ ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లి వారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్‌ రెడ్డి తదితరులపైనా దాడికి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పని చేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.⇒ ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు.పెట్రోల్‌ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్‌ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేరి్పంచారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.⇒ తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్సార్‌సీపీ నాయకులపైనే తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్‌ రోజున మరింత మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.⇒ ఆగస్టు 8న వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమ వైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని.. తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్‌సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ⇒ అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు.. ఆగస్టు 8న వైఎస్సార్‌సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్‌ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.వీళ్లు ఓటేయడానికి వెళ్లకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడటం.. ఈ మాదిరి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. (పోలింగ్‌ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్నది టేబుల్‌లో పరిశీలించగలరు.)⇒ నల్లగొండువారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంత మంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్న సమయంలో బైండోవర్‌ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు.అయినా వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వీరిని వదిలి పెట్టాల్సి వచి్చంది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.⇒ ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్‌ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తు­న్నారు. వారిపైనా దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్‌ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.

Bihar Deputy Chief Minister in Double Voter ID Row, Poll Body Sends Notice2
బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..

పట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన వివాదం ఇప్పుడు డబుల్ ఓటరు ఐడీ నోటీసుల వరకూ దారి తీసింది. తాజాగా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు పోల్ బాడీ నోటీసు జారీ చేసింది. నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తున్న తరుణంలో విజయ్ కుమార్ సిన్హా ఎన్నికల కమిషన్ నుండి నోటీసు రావడం గమనార్హం.తాజాగా బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం‘ఎక్స్‌’లోచేసిన ఒక పోస్ట్‌లో తన అసెంబ్లీ సీటు అయిన లఖిసరైలో ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ, దానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అలాగే పట్నాలోని బంకిపూర్‌లో కూడా ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ ఆధారం చూపించారు. ఈ నేపధ్యంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం ఐదు గంటలలోపు దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు.రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజస్వి యాదవ్ తాజాగా ఉప ముఖ్యమంత్రికి రెండు ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, సిన్హాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎలక్షన్‌ కమిషన్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిన్హా మాట్లాడుతూ తాను ఒకేచోట నుండి ఓటు వేశానని, తేజశ్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన పేరు ఒటరు జాబితాలో రెండు చోట్ల ఉండటానికిగల కారణాలను వివరిస్తూ.. తొలుత తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే 2024 ఏప్రిల్ లో, తాను లఖిసరైలో తన పేరును జతచేర్చుకునేందుకు దరఖాస్తు చేశానన్నారు. అదే సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ నుండి తొలగించేందుకు ఫారమ్‌ను కూడా నింపి సమర్పించానన్నారు. అయితే ఏవో కారణాలతో బంకిపూర్ నుండి తన పేరు తొలగించలేదని విజయ్ కుమార్ సిన్హా వివరణ ఇచ్చారు.

Pakistan Army Chief Asim Munir Sensational Comments Against India3
భారత్‌, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్‌ ఆర్మీ చీఫ్‌ అనుచిత వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగారు. పాకిస్తాన్‌ వద్ద క్షిపణులకు లోటు లేదంటూనే.. తమ నాశనం అంటూ జరిగితే.. పాక్‌తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కుక్క తోక వంకర అన్న చందంగా.. పాక్‌ వైఖరి ఎప్పటికీ మారదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌.. అమెరికా పర్యటనలో ఉన్నారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో మునీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అక్కడ ఉన్న పాక్‌ పౌరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్‌పై నోరుపారేసుకున్నారు. కార్యక్రమంలో మునీర్‌ మాట్లాడుతూ..‘మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. అవసరమైతే అణు యుద్ధానికి దిగుతాం. సింధూ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు మేం ఎదురుచూస్తాం. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. ఒకవేళ భవిష్యత్తులో భారత్‌ నుంచి మా అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో, వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025ఇదిలా ఉండగా.. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల మంటలు ఇంకా చల్లారక ముందే ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు అణు దాడి బెదిరింపులు విసురుతోంది. దీంతో, మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంది. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అండతోనే పాకిస్తాన్‌ ఇలా రెచ్చిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025

It was a terrible journey we were lucky to survive: MP Venugopal4
‘అదో భయంకర ప్రయాణం.. లక్కీగా బతికాం’: ఎంపీ వేణుగోపాల్‌

న్యూఢిల్లీ: మరో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. త్రివేండ్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా చెన్నైకి అత్యవసరంగా మళ్లించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ఆ విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్‌’ పోస్టులో తెలియజేశారు. అదొక భయంకర ప్రయాణమని, విషాదానికి దగ్గరగా వచ్చామని దానిలో పేర్కొన్నారు.వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అప్పటికే బయలుదేరడానికి ఆలస్యం అయిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురయ్యింది. దీంతో దానిని చెన్నైకి మళ్లించారు. ‘త్రివేండ్రం నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2455లో నేను, పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మేమంతా విషాదానికి దగ్గరగా వచ్చాం. ఆలస్యంగా బయలుదేరిన విమానం తరువాత భయంకరమైన ప్రయాణానికి దారి తీసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేమంతా కుదుపులకు గురయ్యాం. దాదాపు గంట తర్వాత కెప్టెన్ విమానంలో సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి, దానిని చెన్నైకి దారి మళ్లించారు. అయితే విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి కోసం రెండు గంటల పాటు ఎదురు చూశాం. మొదటి ప్రయత్నంలో అదే రన్‌వేపై ఒక విమానం ఉండటంతో మా విమానం ల్యాండ్‌ కావడం సాధ్యం కాలేదన్నారు. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైలట్‌ నైపుణ్యం, అదృష్టం కారణంగానే మేమంతా ప్రాణాలతో బయటపడ్డామని’ వేణుగోపాల్ పేర్కొన్నారు. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని, అలాంటి లోపాలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలని ఎయిర్‌ ఇండియాను ఆయన కోరారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ ఇండియా.. రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల ఈ విమానం ల్యాండ్‌ కాలేదని, చెన్నై ఏటీసీ సూచనల మేరకు తరువాత ఆ విమానం ల్యాండ్‌ అయ్యిందని తెలిపింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌ ఇండియా పేర్కొంది. గత జూన్ 12న అహ్మదాబాద్‌లో చేసుకున్న ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, మరో 19 మంది ఇతరులు మృతి చెందారు. నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్జ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025

Musheer Khan Picked 10 Wickets And Scored 119 Runs In A Match In Kanga League5
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు

టీమిండియా యువ సంచలనం ముషీర్‌ ఖాన్‌ ఇటీవలికాలంలో ప్రతి మ్యాచ్‌లో చెలరేగిపోతున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్‌ పర్యటనలో హ్యాట్రిక్‌ సెంచరీలు సహా ఓ 10 వికెట్ల ప్రదర్శన (మ్యాచ్‌ మొత్తంలో), ఓ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ ముంబై కుర్రాడు.. తాజాగా ముంబైలోనే జరుగుతున్న ప్రతిష్టాత్మక కంగా లీగ్‌లో మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. ఈ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో ముషీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు, 3 వికెట్లు (8 పరుగులకే).. రెండో ఇన్నింగ్స్‌లో 35 (నాటౌట్‌) పరుగులు, 7 వికెట్లు (4 పరుగులకే) తీశాడు. ఈ మ్యాచ్‌ మొత్తంలో అతను 119 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.ఇటీవలికాలంలో ముషీర్‌ ప్రదర్శనలు చేస్తుంటే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాయి. 20 ఏళ్ల ముషీర్‌ మరో టీమిండియా యువ కెరటం​ సర్ఫరాజ్‌ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. సర్ఫరాజ్‌ కూడా అదిరిపోయే ప్రదర్శనలతో భారత టెస్ట్‌ అరీనా చుట్టూ ఉన్నాడు. అయితే సీనియర్లు క్రియాశీలకంగా ఉండటంతో అతనికి సరైన అవకాశాలు రావడం లేదు. టీమిండియాలో స్థిరపడటానికి అన్న సర్ఫారాజ్‌తో పోల్చుకుంటే తమ్ముడు ముషీర్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ముషీర్‌ రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో పాటు అదిరిపోయే లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేస్తాడు.ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్‌.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముషీర్‌ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్‌ 2024 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఆ టోర్నీలో ముషీర్‌ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్‌.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.కాగా, ముషీర్‌ ఇటీవల ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఎమర్జింగ్‌ టీమ్‌ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటించాడు. ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్‌.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్‌ నేషనల్‌ కౌంటీస్‌) జరిగిన రెండో మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్‌) చేసిన ముషీర్‌.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్‌ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.జులై 10న ముషీర్‌ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్‌ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Upcoming OTT Telugu Movies August 2nd Week 20256
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు

మరో వారం వచ్చేసింది. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటికోసం అభిమానులు ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ ఏకంగా 30 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ చిత్రాలే కొన్ని ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్)ఓటీటీల్లో రిలీజయ్యే కొత్త సినిమాల విషయానికొస్తే జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, టెహ్రాన్ మూవీస్‌తోపాటు సారే జహాసే అచ్చా, అంధేరా సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. కొత్త చిత్రాలు.. వీకెండ్‌లో ఏమైనా సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 11 నుంచి 17వరకు)జీ5టెహ్రాన్ (హిందీ సినిమా) - ఆగస్టు 14జానకి వి vs స్టేట్ ఆ‍ఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15నెట్‌ఫ్లిక్స్సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 12ఫిక్స్డ్ (ఇంగ్లీష్‌ మూవీ) - ఆగస్టు 13లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) - ఆగస్టు 13సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 13ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 14మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) - ఆగస్టు 14ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్అంధేరా (హిందీ సిరీస్) - ఆగస్టు 14హాట్‌స్టార్డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) - ఆగస్టు 11ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13లిమిట్‌లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 (రియాలిటీ షో) - ఆగస్టు 11కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) - ఆగస్టు 13బుక్ మై షోఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) - ఆగస్టు 11లయన్స్ గేట్ ప్లేద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ సినిమా) - ఆగస్టు 14మూవీ సెయింట్స్కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీస్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?)

Congress Anand Sharma Resigns Chairman Of Foreign Affairs Department7
కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. కీలక పదవికి సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ రాజీనామా

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ.. విదేశీ వ్యవహారాల విభాగ అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామాలో లేఖలో కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాజీనామాకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆనంద్‌ శర్మ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా తన లేఖలో ఆనంద్‌ శర్మ..‘ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఆనంద్‌ శర్మ.. ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా దశాబ్ద కాలం పనిచేశారు. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆనంద్‌ శర్మ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలపై కాంగ్రెస్‌కు ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతున్నారు. అయితే, ఆనంద్ శర్మ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగనున్నారు.Former Union Minister and Congress leader Anand Sharma has resigned from the post of the Chairman of Foreign Affairs Department of AICC. He continues to be a member of CWC. (File photo) pic.twitter.com/RsIGBDgTOz— ANI (@ANI) August 10, 2025గతంలో ఇండో-యుఎస్ అణు ఒప్పందం చర్చలలో ఆయన గతంలో కీలక పాత్ర పోషించారు. నిర్మాణాత్మక పద్ధతిలో భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యం, మొదటి భారత్‌-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌ వైఖరిని చాటిచెప్పేందుకు విదేశాలకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధులలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత భారత్‌ వైఖరిని శర్మ ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు. వాణిజ్య మంత్రిగా తన పదవీకాలంలో మొట్టమొదటి WTO ఒప్పందం, సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు.

IMD Says Heavy Rain Forecast To Telangana8
తెలంగాణకు అలర్ట్‌.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు.. హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :10-08-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/7Vx8ZrRLag— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 10, 2025నేడు, రేపు భారీ వర్షాలు.. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి.Overnight, as expected, South, East TG like Rangareddy, Mahabubnagar, Nagarkurnool, Narayanpet, Khammam, Suryapet, Yadadri - Bhongir, Vikarabad rocked 💥🌧️ Next 2hrs, NON STOP MODERATE RAINS to continue in Gadwal, Wanaparthy, NagarkurnoolScattered rains ahead in Asifabad,…— Telangana Weatherman (@balaji25_t) August 11, 2025ఇక, ఆదివారం నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్‌ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.మరోవైపు.. ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Raghuramakrishna Raju, Ayyannapatrudu efforts to Pressure to be included in cabinet9
మంత్రి పదవులే ముద్దు!

సాక్షి, అమరావతి: చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజులు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కొత్తగా కొందరు సీనియర్లను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని చాలా రోజులుగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పనితీరు మార్చుకోకపోతే పదవుల నుంచి తప్పిస్తానని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఏడాదిగానే ప్రతిపక్షం మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని, వైఎస్సార్‌సీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని, ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారనే అభిప్రాయం చంద్రబాబులో బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా రాయించడం, వ్యతిరేక వార్తలు ప్రసారం చేయించడం ద్వారా బురద చల్లడం మినహా మంత్రులెవరూ విపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్‌ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని భావించారు. అయితే ఆయనకు స్పీకర్‌ పదవి దక్కింది. ఇక డిప్యూటీ స్పీకర్‌ హోదాలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన రఘురామ నేరుగా కొన్ని టీవీ ఛానళ్ల డిబేట్లలో పాల్గొంటూ తనకు ఆ రూలు వర్తించదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు లోకేష్‌ అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

TDP Leader Arrest In Red Sandalwood Case10
ఆ ఎర్ర స్మగ్లర్‌.. పచ్చనేతే!

కడప అర్బన్‌: మోస్ట్‌వాంటెడ్‌ స్మగ్లర్‌ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్‌ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్‌ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్‌ సర్కిల్‌లో బెనర్జీ అనే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement