బంగారం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత | Gold Purchased Out Of Disclosed Income Is Not Chargeable To Tax | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 3:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

నోట్ల రద్దు అనంతరం కేంద్రం దృష్టి బంగారంపై పడినట్టు పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బంగారం కొనుగోళ్లపై స్పష్టతనిచ్చారు. వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. దాంతో పాటు పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో, ఇంట్లో దాచుకున్న నగదుతో కొన్నా తమకెలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన బంగారంపై, నగలపై ఎలాంటి పన్నును ప్రభుత్వం విధించదని జైట్లీ క్లారిటీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులు ఇబ్బడిమొబ్బడిగా బంగారం కొనుగోళ్లు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement