ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ద్విభాష చిత్రంగా ఈ సినిమాను తీశామని తెలిపారు. తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో చెబుతామన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. 3డీ సీజీ టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.
Published Fri, Jul 24 2015 1:25 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
Advertisement