కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులకు మృత్యువు ట్రాక్టర్ రూపంలో ఎదురొచ్చింది. ముగ్గురు స్నేహితులు కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న నాగార్జున(18), మధుసూధన్(18) మరో యువకుడు కలిసి బనగానపల్లి నుంచి కొయ్యలకుంట్ల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో నాగార్జున, మధుసూధన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం