అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేనిపల్లెలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై ఉప్పరి సుధాకర్ (22), షేక్ సుకుర్ బాషా (35)తో పాటు పదోతరగతి విద్యార్థిని ప్రవల్లిక (15) మృతి చెందింది. ఉప్పరి మద్దమ్మ, రజిత అనే మరో ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మిక్కినేనిపల్లెకు చెందిన ఉప్పరి సుధాకర్ మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సీడు పత్తి సాగు చేశాడు. ఇతని మేనమామ లకు‡్ష్మడు కూడా సుధాకర్ పొలం పక్కనే తనకున్న ఎకరా పొలంలో పత్తివేశాడు.
మృత్యు తీగలు
Published Sat, Oct 14 2017 7:45 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement