త్వరలో 9,342 పోస్టులకు నోటిఫికేషన్లు | 9.342 posts notifications in Telangana State Public Service Commission | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 20 2017 7:16 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

హైదరాబాద్‌: త్వరలో 9,342 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కసరత్తు చేస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదించి, భర్తీ కోసం అప్పగించిన ఆయా పోస్టులకు వివిధ శాఖల నుంచి ఇండెంట్లు, వివరణలు రాగానే నోటిఫి కేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2014 ఆగస్టులో ఏర్పడిన టీఎస్‌పీఎస్సీ 2015 జూలై నుంచి ఇప్పటివరకు 24 నోటిఫికేషన్లు జారీ చేసి 4,295 పోస్టులను భర్తీ చేసింది. మరో 1,645 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు తెలిపింది.

Advertisement
 
Advertisement