దేశమంతా ‘ఉప్పె’న..! | A national shortage of salt as the rumors said | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 13 2016 7:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

పాత ఢిల్లీలో మొదలైన ఉప్పు కొరత వదంతులు దేశమంతా పాకిపోయారుు. వీటికి సోషల్ మీడియా కూడా తోడు కావడంతో పుకార్లు యథేచ్ఛగా షికారు చేశారుు. గురువారం ఢిల్లీ చాందినీచౌక్, ఖారీబవోలీ, సదర్ బజార్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ మార్కెట్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దీంతో శుక్రవారం ఈ మార్కెట్లన్నీ మూతపడ్డాయని, ఈ నేపథ్యంలోనే వదంతులు ప్రారంభయ్యాయని పలువురు చెపుతున్నారు. శుక్రవారం నుంచే ఉప్పు కొరత ఉందంటూ ప్రచారం మొదలైంది. దీంతో నోరుుడా, లక్ష్మినగర్, చాందినీచౌక్ తదితర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నారుు. ‘‘ఈ వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. కేజీ రూ.25 ఉండే ఉప్పు మధ్యాహ్నానికి రూ.50 అరుు్యంది. సాయంత్రానికి పుకార్లు మరింత వ్యాపించడంతో అది రూ.250కి చేరింది. ఇప్పుడు అసలు ఉప్పు అందుబాటులో లేనే లేదు’’ అంటూ జామామసీదు ప్రాంతంలో నివసించే హజీ మొరుున్ ఫయాజుద్దీన్ చెప్పారు. స్థానిక మార్కెట్లు మూతపడటంతో పాలు, పంచదార, నూనెలు ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు కొరత వదంతులు నెమ్మదిగా ఉత్తరప్రదేశ్‌కు కూడా పాకారుు. దీంతో మొరాదాబాద్, మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో కిలో ఉప్పు రూ.200కి చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే శనివారం సాయంత్రానికి చాలా చోట్ల ఉప్పు నిల్వలు కరిగిపోయారుు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement