దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి అల్ ఖైదా కుట్ర పన్నినట్టు ఇంటలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అల్ ఖైదా నిషేధిత సిమి తీవ్రవాదుల సహకారం కోరుతున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబై మహానగరాల్లో అల్ ఖైదా రిక్రూట్మెంట్కు ప్రయత్నిస్తున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాల కథనం. కంప్యూటర్ల పరిజ్ఞానం, విమానాలపై అవగాహన ఉన్న వారిని ఆకర్షించేందుకు అల్ ఖైదా ప్రయత్నాలు చేస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు పేర్కొంది. అల్ ఖైదా, ఇండియన్ ముజాహిద్దీన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయని వెల్లడించాయి.