ప్రత్యేక హోదా పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అందుకే తమ పార్టీ నేతలు, విద్యార్థులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని, ఎప్పుడూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఉద్యమాలను అణచివేస్తే బ్రిటీష్ వారికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు.