ఈనెల 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏపీఎన్జీవోలు ప్రకటించారు. సోమవారం సమావేశమైన ఏపీఎన్జీవోలు తమ భవిష్య కార్యచరణను మీడియాకు తెలిపారు. 19, 20 తేదీల్లో బ్యాంకుల సహా ప్రభుత్వకార్యాలయాల ముట్టడించేదుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 6నుంచి 8వరకూ లైట్లు ఆపి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతామన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అవగాహన సదస్సులు, అనంతరం మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో ప్రయివేట్ ట్రావెల్స్ బంద్ నిలిపివేయాలని, 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేసి నిరసనను ముమ్మరం చేయాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించారు. ఈనెల 23 నుంచి 30వరకూ ప్రయివేటు విద్యాసంస్థలు మూసివేయాలని ఏపీఎన్జీవోలు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఏపీఎన్జీవో కార్యాలయంలో వాడివేడిగా జరిగింది.
Published Mon, Sep 16 2013 5:03 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement