samaikyandhra jac
-
జగన్ ధర్నాకు సమైక్యాంధ్ర జెఎసి మద్ధతు
-
రాష్ట్రానికి విద్రోహ దినం
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, అందుకు కారణమైన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజును జిల్లా వాసులు బ్లాక్‌డేగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కడప నగరంలో ఉపాధ్యాయ జేఏసీ నేత లెక్కల జమాల్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్లజెండాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సిగ్గులేకుండా పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోకపోతే ప్రజల్లో తిరగనీయబోమన్నారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సోనియా గాంధీ తన బర్త్‌డే కేక్‌ను కట్ చేసినట్లు రాష్ట్రాని చీల్చాలనుకోవడం సహించరాని విషయమన్నారు. బద్వేలు ఏపీ ఎన్జీవోలు సోమవారాన్ని బ్లాక్‌డేగా పాటించారు. నల్లజెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పులివెందులలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరలించి ర్యాలీ నిర్వహించారు. సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నందలూరులో పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, అందుకు నిరసనగా సోమవారాన్ని బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరులో న్యాయవాదులు బ్లాక్‌డే పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. -
సమైక్య సత్యాగ్రహం
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రులు వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలు గురువారం 114వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ, విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గరువారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన సమైక్య సత్యాగ్రహం సభ విజయవంతమైంది. నగరంలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ప్రజలూ పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసోం గణపరిషత్ ఎంపీ జోసఫ్ టోపో, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీ ప్రభుత్వాలకు రాష్ట్రాన్ని విభజించే అధికారం లేదన్నారు. డిసెంబర్‌లోపు 371డీని సవరించడం సాధ్యం కాదని, ఈ తరుణంలో ఉద్యమం ఉధృతంగా చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని పేర్కొన్నారు. విశాఖ జిల్లా న్యాయవాదులు కోర్టు ప్రాంగణం నుంచి మద్దిలపాలెం కూడలి వరకు బైక్‌ర్యాలీ తీసి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. -
జాతీయ పార్టీలను భూస్థాపితం చేస్తాం
గుంటూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేస్తామని సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు చేపట్టబోయే కార్యాచరణను రూపొందించేందుకు మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో సీమాంధ్ర విశ్వవిద్యాలయాలు, జిల్లా స్థాయి సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ మాట్లాడుతూ తెలుగు జాతిని, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచే వారికే కేంద్రంలో పాలించే అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించే బాధ్యతను వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఎన్.చంద్రబాబునాయుడు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కార్యాచరణ.. : నవంబర్ 1న తెలుగు తల్లికి క్షీరాభిషేకం, కొవ్వొత్తుల ప్రదర్శన, 2న సోనియా, రాహుల్, సుష్మాస్వరాజ్‌ల దిష్టిబొమ్మల దహనం, 4న కాంగ్రెస్, 5న బీజేపీ ఆఫీసుల వద్ద ధర్నా, 6న హైవేల దిగ్బంధం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. తీర్మనాలు.. : కాంగ్రెస్, బీజేపీల కార్యాలయాల వద్ద పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు నిరసన కార్యక్రమాలు జరపాలని, విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించని ఎమ్మెలేలను అడ్డుకోవాలని తీర్మానించారు. -
తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు: జేడీ శీలం
విజయవాడ : కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలంకు మరోసారి సమైక్య సెగ తగిలింది. మంగళవారం ఉదయం విజయవాడలో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్ర నేతల వైఖరి తెలపాలంటూ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ...జేడీ శీలంను డిమాండ్ చేశారు. విభజన విషయంలో తాము సందిగ్ధంలో ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే మిగతా నేతల గురించి వ్యాఖ్యానించే స్థాయి తనకు లేదన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, అయితే విభజనతో వచ్చే సమస్యలు పరిష్కరించుకుందామని జేడీ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీంచే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది నియంతల పార్టీ... ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అన్నారు. ఉద్యమ నేతలతో మంత్రులు మాట్లాడుతున్నారని.... సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీకి వివరిస్తామన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చిత్తశుద్దితో పని చేస్తోందని ఆయన తెలిపారు. కాగా విభజన ప్రక్రియ మొదలైందని...అయితే ఇది అంతం కాదని... ఆరంభం మాత్రమేనని జేడీ శీలం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందో రాదో తనకు తెలియదన్నారు. -
రాయచోటి రణభేరి
-
సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా లక్ష్మణరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఎంపికయ్యారు. సమైక్య రాష్ట్రం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ రెడ్డి, డి.గోపాలకృష్ణ, ఎన్యూ మాజీ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్థిక నిపుణుడు ఎం.ఎల్.కాంతారావు, ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, ప్రముఖ వైద్యులు పద్మాచౌదరి, వ్యవసాయరంగ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్ పలువురు నిపుణులు, విద్యార్థి సంఘ నేతలు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. -
ఈ నెల 24న రాష్ట్ర బంద్ కు ఏపీఎన్జీవోల పిలుపు
-
ఈ నెల 24న రాష్ట్ర బంద్ కు ఏపీఎన్జీవోల పిలుపు
హైదరాబాద్:ఈనెల 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏపీఎన్జీవోలు ప్రకటించారు. సోమవారం సమావేశమైన ఏపీఎన్జీవోలు తమ భవిష్య కార్యచరణను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సీమాంధ్ర నేతలపై మండిపడ్డారు. రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు. 19, 20 తేదీల్లో బ్యాంకుల సహా ప్రభుత్వకార్యాలయాల ముట్టడించేదుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 6నుంచి 8వరకూ లైట్లు ఆపి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతామన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అవగాహన సదస్సులు, అనంతరం మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో ప్రయివేట్ ట్రావెల్స్ బంద్ నిలిపివేయాలని, 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేసి నిరసనను ముమ్మరం చేయాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించారు. ఈనెల 23 నుంచి 30వరకూ ప్రయివేటు విద్యాసంస్థలు మూసివేయాలని ఏపీఎన్జీవోలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామని అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20 తేదీన విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఏపీఎన్జీవో కార్యాలయంలో వాడివేడిగా జరిగింది. -
రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి
హైదరాబాద్: రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి సారించనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జేఏసీ సోమవారం ఏపీఎన్జీవో భనవ్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణపై చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైల్ రోకో కార్యక్రమాల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అంతకుముందు ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. -
జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నాం: టీజీ
-
జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నాం: టీజీ
కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. సమైక్యాంధ్ర జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని పేర్కొన్నారు. సీమాంధ్రలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు. కర్నూలులోని కృష్ణదేవరాయల విగ్రహం వద్ద సమైక్యవాదులు తనను అడ్డుకోవడంపై టీజీ వెంకటేష్ పడ్డారు. నలుగురైదుగురితో రాళ్లెయిస్తే దాన్ని ఉద్యమం అంటారా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం తాను ఎంతో కాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. జేఏసీ రాజీనామా చేయమంటే తక్షణమే చేస్తామని చెప్పారు. తాము అధికారంలో ఉండబట్టే హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోల సభకు అవకాశం కల్పించగలిగామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అనుకూలంగా లేఖ ఇచ్చిన నాయకుడు యాత్ర చేస్తున్న పట్టించుకోకుండా తనను అడ్డుకోవడం తగదని అన్నారు. -
కృష్ణాజిల్లాలో సకలం బంద్
విజయవాడ : సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా కృష్ణాజిల్లాలో సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్‌కు కొనసాగుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు రెండురోజులు సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు. అత్యవసర సేవలైన ఆస్పత్రులు మినహా విద్యాసంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు మూతపడ్డాయి. దీంతో బెజవాడ మొత్తం నిర్మానుష్యంగా మారింది. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు మేము సైతం అంటున్నారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. ఇంతవరకు అన్నిశాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు ఉద్యమంలోకి దిగినా విద్యుత్ ఉద్యోగులు మాత్రం పాక్షికంగా సమ్మెలో పాల్గొన్నారు. కానీ రోజురోజుకీ ఉద్యమ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో గురువారం నుంచి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కం అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్స్ ఉద్యోగులు సుమారు 30 వేలమంది నిరవధిక సమ్మెలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగా లైన్ ఇన్స్పెక్టర్ నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు తమ వద్దనున్న ప్రభుత్వ సెల్‌ఫోన్ సిమ్‌లను నేడు తమ తమ కార్యాలయాల్లో అందజేయనున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా తక్షణం విటిపిఎస్పై సమ్మె ప్రభావం పడుతుంది. -
ఆంటోని కమిటీ అటకెక్కేనా..?
-
విద్యార్ఠుల భారీ నిరసన ర్యాలీ
-
చంద్రబాబు ఎప్పుడొచ్చినా అడ్డుకుంటాం
-
జిల్లా వ్యాప్తంగా కదంతొక్కుతున్న సమైక్యవాదులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నిన కాంగ్రెస్ అధిష్టానానికి తగిన గుణపాఠం తప్పదని జిల్లా ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్నా ప్రజల్లో ఎక్కడా ఉద్యమస్ఫూర్తి తగ్గ లేదు. పేద,ధనిక తేడా లేకుండా అంతా ఐక్యంగా నిరసన ప్రదర్శనలు చే స్తున్నారు. జిల్లాలో శనివారం సమైక్యాంధ్ర జేఏసీ, రాజకీయ జేఏసీ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆచార్య ఎన్. శామ్యూల్, ఆచార్య పి.నరసింహారావు, మండూరి వెంకటరమణల నేతృత్వంలో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ర్యాలీలు చేశారు. రాజకీయ జేఏసీ నేతృత్వంలో జరిగిన రిలేదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. సత్తెనపల్లి, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేటలలో ఆర్టీసీ ఉద్యోగులు మౌన ప్రదర్శన, రాస్తారోకోలు నిర్వహించగా, రేపల్లెలో ఆర్టీసీ కార్మికులు ఒంటికాలిపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలిచ్చారు. జిల్లా కోల్డ్‌స్టోరేజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్, మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు, నర్సులు వినూత్నంగా నిరసన తెలిపారు. యూపీఏ అధినేత్రి సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ వేషాల మాస్క్‌లు ధరించి కూరగాయలు కోసి ఇలానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు రోడ్డుపైనే వంట చేసి భోజనాలు చేశారు. ఉద్యోగుల నిరసనలు .. ఏపీ ఎన్జీవోస్ జేఏసీ చేస్తున్న సమ్మెకు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గజిటెడ్ అధికారులు మద్దతు తెలుపుతున్నారు. చిలకలూరిపేటలో కమిషనర్, తహశీల్దార్, గజిటెడ్ అధికారులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గుంటూరులో వ్యవసాయశాఖ ఉద్యోగులు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు భారీ ప్రదర్శన, మానవహారం చేశారు. రోడ్డుపై వరినాట్లు వేసి తమ నిరసన తెలిపారు. పురుగుమందుల కంపెనీల అసోసియేషన్‌తో పాటు ఆదర్శ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నాన్‌టీచింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన నినాదాలిచ్చారు. తెనాలిలో న్యాయశాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. బాపట్లలో వీఆర్వోల ర్యాలీ, చిలకలూరిపేటలోని కావూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి విద్యార్థులతో సహా ర్యాలీ చేశారు. అన్నిచోట్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరులో ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆర్ధనగ్న ప్రదర్శన చేశారు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మిక జేఏసీతో ఆయన క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. దీక్షలకు సంఘీభావం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లెలలో రిలేదీక్షలు కొనసాగుతు న్నాయి. గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో పలు ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థులు దీక్షలకు కూర్చొన్నారు. దాచేపల్లిలో దళితనాయకుడు మస్తాన్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. మంగళగిరి, తాడేపల్లిలో ్రపభుత్వ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. మంగళగిరిలో బైక్ మెకానిక్‌ల ర్యాలీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ వాడకాన్ని బంద్ చేసి నిరసన తెలిపారు. గుంటూరులో బార్ అసోసియేషన్ ఇప్పటికే సమ్మె చేస్తుండగా, ఈనెల 31న సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సభ గుంటూరులో నిర్వహించాలని నిర్ణయమైంది. -
విజయమ్మ దీక్షకు సమైక్యాంధ్ర జేఏసీ మద్దతు
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా, కార్మికులందరూ విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ముందుకు రావాలని కోరారు. సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రులు, రాజకీయేతర ప్రముఖులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, రైతు నాయకులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శివాజీ తెలిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేసినా ఏపీఎన్జీవోలు స్వాగతిస్తారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. - ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విభజన తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజ యమ్మ ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన్రెడ్డి, మరో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాలు చేయడం.. సీమాంధ్ర ప్రజలకు కొంత ఆత్మస్థైరం కలిగించింది. ఆమరణ దీక్ష చేపట్టాలని విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె నిర్ణయం కాంగ్రెస్ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిస్తుందని ఆశిస్తున్నాం. - ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి ‘‘సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇతర పార్టీల నాయకులు సైతం ఆమె బాటలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిజాయతీగా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలి’’. -టి.వి.రామిరెడ్డి, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, గుంటూరు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష సమైక్య ఉద్యమానికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, సీమాంధ్రలో అన్నివర్గాల ప్రజలు కదిలి చేస్తున్న ఆందోళనతో పాటు ఆమె చేపట్టనున్న ఆమరణ దీక్ష ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి పెంచడానికి తోడ్పడుతుంది. - ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విజయమ్మ ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నాం. దీక్షకు ఎన్జీవోలుగా మద్దతు ఇస్తాం. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలి. -గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు విభజనను నిరసిస్తూ జగన్, విజయమ్మ పదవులకు రాజీనామా చేయడం సాహసోతమైన నిర్ణయం. సీఎం కిరణ్, చంద్రబాబు మాత్రం పదవులకు రాజీనామా చేయకుండా సీమాంధ్రుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. - ఎన్జీవో సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు దేవరాజు -
YSR జిల్లాలో ఉద్యమంపై JAC సమావేశం
-
ఊరూరా సమైక్యాంధ్ర ఉద్యమం
సాక్షి నెట్వర్క్: ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. సమైక్యాంధ్ర కొనసాగించడం.. ఇదే శ్వాసగా, ఆశగా సీమాంధ్రలో ఊరూవాడా ఉప్పెనలా ఉద్యమం ఉరకలేస్తోంది. సమైక్యాంధ్ర సాధనలో కదం తొక్కుతున్న కోస్తా, రాయలసీమ ప్రజ పండుగరోజు కూడా విశ్రమించలేదు. రంజాన్ పర్వదినం సందర్భంగా నిరసనలకు సడలింపు ఇవ్వాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చినప్పటికీ అన్నిచోట్లా ఆందోళనలు మిన్నంటాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనప్రదర్శనలతో సీమాంధ్ర ఊళ్లు దద్దరిల్లాయి. కాంగ్రెస్ నేతలపై జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. సోనియాగాంధీ, రాహుల్, దిగ్విజయ్, బొత్సలతో పాటు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు, వినూత్ననిరసనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల కూడలిలో నిర్వహించిన నమూనా ప్రజాకోర్టులో కేసీఆర్‌కు ఉరిశిక్ష విధించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పీసీసీ చీఫ్ బొత్స దిష్టిబొమ్మకు చెప్పులు వేసి ఊరేగించారు. కర్రలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏకలవ్య అసోసియేషన్ సభ్యులు సీమ పందిపై కేసీఆర్ పేరు రాసి పట్టణంలో డప్పుల విన్యాసాలతో ఊరేగించారు. విశాఖ జిల్లా అరకులో మార్కెట్ వ్యాపారులు కేసీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, పెద్ద కర్మ నిర్వహించారు. తిరుపతిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తాళ్లతో బంధించి లాక్కుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో గంగిరెద్దుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లతో ప్లకార్డులు కట్టి ఊరేగించారు. రోడ్డుపైనే ముస్లింల నమాజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగింపే లక్ష్యంగా ముస్లింలు రంజాన్రోజు కూడా ఆందోళనలు హోరెత్తించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కర్బలా మైదానంలో రంజాన్ నమాజ్‌లను ముగించుకున్న అనంతరం ముస్లింలంతా పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ప్రత్యేక నమాజ్‌లు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో సుమారు 10వేల మందికిపైగా ముస్లింలు మదనపల్లె రోడ్డు నుంచి ఈద్గా మైదానం వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అల్లాను ప్రార్థించారు. సత్యవేడులో ముస్లింలు ర్యాలీ నిర్వహించి అనంతరం పండుగలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివయ్యస్థూపం సెంటర్లో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈద్గాలలో ప్రార్థనల అనంతరం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ శాంతి ర్యాలీలు చేపట్టారు. ఎస్కేయూలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రార్థనల అనంతరం భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పక్కన ఉన్న మసీదులో ప్రార్ధనలు ముగించుకున్న ముస్లింలు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల నిరసన విశాఖలో విద్యుత్ ఉద్యోగులు సీతమ్మధారలోని ఈపీడీసీఎల్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరి మద్దిలపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడి నుంచి ఎన్ఏడీ కూడలికి బయలుదేరి అక్కడా రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రదర్శన ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు విద్యార్థి జేఏసీతో కలిసి మద్దిలపాలెం జాతీయరహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, బహిరంగ స్నానాలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, విద్యార్థి, ప్రజా సంఘాల నేతృత్వంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ కర్మాగారాన్ని ముట్టడించారు. గాజువాకలోని లంకెలపాలెం వద్ద వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వైద్య, ఉపాధ్యాయ, న్యాయవాదుల నిరశన కడపలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరాహార దీక్షలు, కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల, రిమ్స్‌లో డాక్టర్ల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేస్తున్న ఆమరణనిరాహారదీక్ష ఐదోరోజుకు చేరింది. రాయచోటిలో జేఏసీ నేతలు చేస్తున్న దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యేల గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట, తెనాలి, రేపల్లె, వినుకొండల్లో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మున్సిపల్ టీచర్ల సమైక్య జేఏసీ అన్నిచోట్లా ర్యాలీలు నిర్వహించింది. రిక్షావాలాల రాస్తారోకో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారిపై 250 మంది రిక్షా కార్మికులు డప్పులు వాయిస్తూ రిక్షాతో భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. తన భార్య సరస్వతి(వాణి) శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు మంత్రి తోట నరసింహం ప్రకటించారు. అంధుల నిరాహారదీక్ష తిరుపతి ఎస్వీయు వద్ద అంధ విద్యార్థులు ఒకరోజు రిలే నిరాహారదీక్ష చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల రిలేదీక్షలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మద్దతు పలికారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తన కుమారుడు పీసీసీ కార్యదర్శి గల్లా జయదేవ్‌తో కలిసి తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగే ఉద్యమాల్లో పాల్గొంటానని మంత్రి గల్లా ప్రకటించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు అంధకూపం శిక్ష విజయనగరం సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దున్నపోతుతో తొక్కిస్తూ అంధకూపం శిక్ష విధించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన కత్తి, కర్రసాము చేసే కళాకారులంతా కత్తులు, కర్రలతో యుద్ధ విన్యాసాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్లలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి విజయనగరం - పాలకొండ రహదారిని దిగ్బంధించారు. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెను ప్రారంభిస్తామని, రాష్టాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించిన ఏఐసీసీ అధిష్టానం సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించే వరకూ కొనసాగిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఏలూరులో స్పష్టం చేశారు. కావూరి, కనుమూరిలను పట్టుకుంటే రూ.లక్ష ఎంపీ కనుమూరి బాపిరాజు, మంత్రి కావూరి సాంబశివరావు కనిపించడం లేదని, వారిని పట్టుకుని అప్పగిస్తే సమైక్య జేఏసీకి రూ.లక్ష ఇస్తానని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరంలో ప్రకటించారు. శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పలాస-కాశీబుగ్గలో ‘సిక్కోలు ధూమ్‌ధామ్’ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఒంగోలులో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రభుత్వ వైద్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పర్చూరులో న్యాయవాదులు చేపట్టిన 5వ రోజు దీక్షాశిబిరాన్ని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఒంగోలులో శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలతో అభిషేకం చేసి అమరజీవి ఆశయం కొనసాగాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని ఎదిరిస్తాం: మంత్రి సారథి సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులో చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి పార్ధసారథి మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎదిరించి కేంద్ర మంత్రులను నిలదీస్తామన్నారు. బెజవాడలో స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్రోడ్డుపై ప్రదర్శనలు చేశారు. వన్‌టౌన్‌లో మార్వాడీ మహిళలు ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా జి కొండూరు మండలం కట్టుబడిపాలెంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సమ్మెకు టీటీడీ ఉద్యోగుల మద్దతు ఈవోకు నోటీసులు అందజేత సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఈమేరకు టీటీడీ ఈవోకు నోటీసులు అందజేసిన అనంతరం ఉద్యోగుల సమాఖ్య నాయకులు విజయకుమార్, ఆంజనేయులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడినట్టు తెలిపారు. స్వామి వారి దర్శనార్థం వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలుగజేయబోమని హామీ ఇచ్చారు. తిరుమలలో ఉద్యోగులు యథావిధిగా విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. 12 నుంచి సమ్మెలో 630 మంది ఎంపీడీవోలు విజయవాడ, న్యూస్‌లైన్ : 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెలో 13 జిల్లాలకు చెందిన 630 మంది ఎంపీడీవోలు పాల్గొంటారని రాష్ట్ర ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిహరనాథ్ చెప్పారు. విజయవాడలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్‌శాఖ ద్వారా అందిస్తున్న సేవలను నిలిపేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. విభజన ప్రక్రియను నిలిపేసి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటించేవరకు కార్యాలయాలు మూసేసి నిరసన తెలియజేస్తామన్నారు. -
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి: సమైక్యాంధ్ర జేఏసీ
సాక్షి, గుంటూరు: ‘ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి.. లేదంటే రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనండి’ అని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర జేఏసీ సూచించింది. ఉద్యమ కార్యాచరణపై విశ్వవిద్యాలయాలు, జిల్లాస్థాయి సమైక్యాంధ్ర జేఏసీల సమావేశం మంగళవారం ఇక్కడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ అధ్యక్షత వహించిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ, ఎంపీలు ఆహార భద్రత బిల్లు ఓటింగ్‌ను బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమం లో పాల్గొనాలని, ఈనెల 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. రాజీనామా డ్రామాలు ఆపి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ మాట్లాడుతూ,సమైక్యాంధ్ర ఉద్యమం తన పేటెంట్ హక్కుగా చెప్పుకున్న కావూరి సాంబశివరావు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రమంత్రి పదవి పొందడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు విఘాతం కలిగించే ఏ నాయకుడినైనా నిలదీయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జి.వి. ఎస్.ఆర్.ఆంజనేయులు, నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ గుంటూరు జిల్లా కన్వీనర్ సదాశివరావు, గుంటూరు జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు ప్రసంగించారు. అనంతరం సమావేశం తీర్మానాలను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్, భవిష్యత్ కార్యాచరణను విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం. వెంకటరమణ వెల్లడించారు. సమావేశం తీర్మానాలు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈనెల 12లోగా రాజీనామాలు చేయాలి సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నామని కేంద్రం {పకటించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మస్థయిర్యంతో పోరాడాలి భవిష్యత్ కార్యాచరణ ఈ నెల 7,8 తేదీల్లో కేంధ్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో బంద్ పాటించాలి 9, 10 తేదీల్లో సీమాంధ్ర ప్రాంతంలో రైల్బంద్ 11, 12 తేదీల్లో విశ్వవిద్యాలయాలు, అన్నిప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలి -
రేపటి నుంచి బంద్ సడలింపునకు జేఏసీ నిర్ణయం
ప.గో: రంజాన్ పండుగ దృష్ట్యా రేపటి నుంచి బంద్‌ను సడలించేందుకు సమైక్యాంధ్రా జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఏలూరు రెవెన్యూ భవన్లో మంగళవారం భేటీ అయిన సమైక్యాంధ్రా జేఏసీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాఠశాలలు, వ్యాపార సంస్థలు తెరుచుకుని సూచనలు కన్పిస్తున్నాయి. కాగా, నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8న అన్ని సంఘాలతో మహాధర్నా చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. 9వ తేదీన ఏలూరు ఆశ్రమ్ పాఠశాల వద్ద జాతీయ రహదారిని దిగ్భందించనున్నామని, 10వ తేదీన విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఆగస్టు 11వ తేదీన సామూహిక దీక్షలకు దిగుతామని, 12న ఏలూరులో సంపూర్ణ బంద్ ప్రకటించనున్నట్లు వారు తెలిపారు. -
సమైక్య ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన సమైక్యాంధ్ర జేఏసీ
సమైక్య ఉద్యమం రగులుతోంది. రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. ఇప్పటికే తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. విద్యార్థి జేఏసీ మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యి, వివిధ విషయాలపై చర్చించింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రేపటి నుంచి సమైక్య నినాదంతో గడప గడపకు పాదయాత్రలు చేస్తామని, 12న లక్షలాది మందితో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సింహగర్జన నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే ఈనెల 18వ తేదీన బీచ్‌రోడ్‌లోని వైఎస్ విగ్రహం నుంచి ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు మిలియన్ మార్చ్ నిర్వహించాలని తలపెట్టింది. అలాగే, రాష్ట్ర విభజన విషయంపై ఏమీ స్పందించకుండా ఊరుకున్నందుకు నిరసనగా కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు చెందని సినిమా ప్రదర్శనలన్నింటినీ నిషేధిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఏదైనా థియేటర్లో వాళ్ల సినిమాలు ప్రదర్శిస్తే.. వాటిపై దాడులు తప్పవని హెచ్చరించింది. నేటినుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్షలు అంతకుముందు సమైకాంధ్రకు మద్దతుగా గాజువాకలోబంద్ పాటించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నేటి నుంచి విద్యుత్తు ఉద్యోగులు అమరణ దీక్షలు చేయాలని తలపెట్టారు. విశాఖలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బంద్ అయ్యాయి. మరోవైపు ఉధ్యామాన్ని అణచివేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్కూల్, ఇంటర్ విద్యార్థులు ఉద్యమంలో పాల్గోంటే వారిపై జువనైల్ చట్టాన్ని అమలు చేస్తామని డీఈవో, ఆర్ఐవోలను హెచ్చరించారు. గుంటూరులోనూ ఉధృతంగా కార్యాచరణ మరోవైపు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో కూడా సమైక్యాంధ్ర జేఏసీ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించి, కార్యాచరణ ప్రటించారు. 6, 7 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 9, 10 తేదీల్లో సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో రైల్‌రోకోలు చేయాలని, 11, 12 తేదీల్లో మండలస్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తెలిపింది. అలాగే.. 13, 14 తేదీల్లో ఉద్యోగులతో కలిసి రాజీనామా చేయని నేతల ఇళ్లను ముట్టడించాలని కూడా తెలిపింది. -
సమైక్యవాదుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో జిల్లాలో సమైక్యవాదుల ఆందోళన ఐదవరోజు ఆదివారం కొనసాగింది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులైన యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి సమైక్యవాదులు తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదు లు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. విజయనగరంలోని మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ముగ్గురు సమైక్యవాదులు గుండు కొట్టించుకుని ఒంటినిండా జై సమైక్యాంధ్ర అని నినాదాలు రాసుకుని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారంతా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుండు గీయించుకుని ఆ ముగ్గురు సమైక్యవాదులతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు స్థానిక ఎత్తుబ్రిడ్జిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మూడు గంటలపాటు విజయనగ రం నుంచి విశాఖ, పార్వతీపురం వెళ్లే రహదారుల ను దిగ్బంధించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకులు ఆ ప్రాంగణంలో కబడ్డీ ఆడగా.. మరికొందరు వాలీబాల్ ఆడుతూ కాలక్షేపం చేశారు. సోనియా దిష్టిబొమ్మను జంక్షన్లో ఊరేగించి దహనం చేసి అంత్యక్రియలు నిర్వహించారు.అనంతరం రహదారిపై సహపంక్తి భో జనాలు చేసి నిరసనను విరమించారు. పట్టణంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతూ నాలుగు చక్రాల వాహనంపై కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి పట్టణమంతా ఊరేగించి దహనం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పట్టణంలోని జీపు, మేజిక్ మ్యాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో 100 వాహనాలతో నిరసన ర్యాలీ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. బొబ్బిలిలో తాపీ పనివారల సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఎస్.కోటలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజు కొనసాగాయి. సమ్మె ఉద్ధృతం చేయాలన్న జేఏసీ పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి గా ఏర్పడి భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చా రు. సాలూరు పట్టణంలో యువత సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లి పట్టణంలో మూడురోడ్ల జంక్షన్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగాయి. గజపతినగరంలో జాతీయ రహదారి వద్ద సమైకాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు జరిగాయి. నేడూ కొనసాగనున్న ఆందోళనలు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉద యం మయూరి జంక్షన్ వద్ద వంటా వార్పు కార్యక్రమం చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ప్రకటించారు. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అశోక్‌బంగ్లా నుంచి గంటస్తంభం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో భా రీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రకటించారు. -
ఆనం ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసి