ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో జిల్లాలో సమైక్యవాదుల ఆందోళన ఐదవరోజు ఆదివారం కొనసాగింది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులైన యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి సమైక్యవాదులు తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదు లు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. విజయనగరంలోని మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ముగ్గురు సమైక్యవాదులు గుండు కొట్టించుకుని ఒంటినిండా జై సమైక్యాంధ్ర అని నినాదాలు రాసుకుని తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారంతా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుండు గీయించుకుని ఆ ముగ్గురు సమైక్యవాదులతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు స్థానిక ఎత్తుబ్రిడ్జిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మూడు గంటలపాటు విజయనగ రం నుంచి విశాఖ, పార్వతీపురం వెళ్లే రహదారుల ను దిగ్బంధించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకులు ఆ ప్రాంగణంలో కబడ్డీ ఆడగా.. మరికొందరు వాలీబాల్ ఆడుతూ కాలక్షేపం చేశారు.
సోనియా దిష్టిబొమ్మను జంక్షన్‌లో ఊరేగించి దహనం చేసి అంత్యక్రియలు నిర్వహించారు.అనంతరం రహదారిపై సహపంక్తి భో జనాలు చేసి నిరసనను విరమించారు. పట్టణంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతూ నాలుగు చక్రాల వాహనంపై కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి పట్టణమంతా ఊరేగించి దహనం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పట్టణంలోని జీపు, మేజిక్ మ్యాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో 100 వాహనాలతో నిరసన ర్యాలీ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. బొబ్బిలిలో తాపీ పనివారల సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు.
ఎస్.కోటలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజు కొనసాగాయి. సమ్మె ఉద్ధృతం చేయాలన్న జేఏసీ పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి గా ఏర్పడి భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చా రు. సాలూరు పట్టణంలో యువత సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లి పట్టణంలో మూడురోడ్ల జంక్షన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగాయి. గజపతినగరంలో జాతీయ రహదారి వద్ద సమైకాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు జరిగాయి.
నేడూ కొనసాగనున్న ఆందోళనలు
సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉద యం మయూరి జంక్షన్ వద్ద వంటా వార్పు కార్యక్రమం చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ప్రకటించారు. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అశోక్‌బంగ్లా నుంచి గంటస్తంభం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో భా రీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రకటించారు.
సమైక్యవాదుల ఆందోళన
Published Mon, Aug 5 2013 5:29 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement