జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నాం: టీజీ
కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. సమైక్యాంధ్ర జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని పేర్కొన్నారు. సీమాంధ్రలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు.
కర్నూలులోని కృష్ణదేవరాయల విగ్రహం వద్ద సమైక్యవాదులు తనను అడ్డుకోవడంపై టీజీ వెంకటేష్ పడ్డారు. నలుగురైదుగురితో రాళ్లెయిస్తే దాన్ని ఉద్యమం అంటారా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం తాను ఎంతో కాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. జేఏసీ రాజీనామా చేయమంటే తక్షణమే చేస్తామని చెప్పారు.
తాము అధికారంలో ఉండబట్టే హైదరాబాద్లో ఏపీ ఎన్జీవోల సభకు అవకాశం కల్పించగలిగామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అనుకూలంగా లేఖ ఇచ్చిన నాయకుడు యాత్ర చేస్తున్న పట్టించుకోకుండా తనను అడ్డుకోవడం తగదని అన్నారు.